Thursday, January 23, 2025

రైతుల ఆర్థిక భారం తగ్గించడానికి రోబోటిక్ యంత్రం తోడ్పాటు

- Advertisement -
- Advertisement -

నంగునూరు: రైతుల ఆర్థిక భారం తగ్గించడానికి రోబోటిక్ యంత్రం ఎంతగానో తోడ్పడుతుందని మాజీ ఎంపిపి జాప శ్రీకాంత్ రెడ్డి, ఆయిల్‌పామ్ రైతు వెల్ఫేర్ సొసైటీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎడ్ల సోమిరెడ్డి, రైతుబంధు మం డల అధ్యక్షుడు బద్దిపడగ కృష్ణారెడ్డి అన్నారు. మంగళవారం నంగునూరు మండలంలోని అక్కెనపల్లి గ్రామంలో ఆయిల్ పామ్ పంటలో ఫామ్ సాథీ అనే అంకుర సంస్థ తయారు చేసిన కలుపు, మందు పిచికారి చేసే రోబోటిక్ యంత్రం ద్వారా రైతుల డెమో కార్యక్రమాన్ని వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా రోబో యంత్రం పని తీరును, యంత్రం ద్వారా కలుగు ప్రయోజనాలను రైతులకు వివరించారు. అనంతరం వారు మాట్లాడుతూ రొబోట్లను వాడి రైతుల పొలంలోని కలుపును తీసివేయడం, మందు పిచికారి సులభతరం చేసుకోవచ్చునని తెలిపారు.

ఇతర పరికరాలతో పోలిస్తే 50 శాతం వరకు తక్కువ ఖర్చుతో పొలాన్ని సేద్యం చేసుకోవచ్చునని అన్నారు. రిమోట్ కంట్రోల్ ద్వారా రోబోట్‌లని ఆపరేట్ చేయవచ్చునని తెలియజేశారు. రాబోయే రోజుల్లో ఇదే రోబోట్‌లని ఆటోమెటిక్ రూపంలో చూడవచ్చునని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. 70 శాతం వ్యవసాయ పనిలో రోబోట్ ఎంతో తోడ్పడుతుందని అన్నారు. దీంతో కలుపు మందుని పూర్తిగా 100 శాతం వరకు తగ్గించవచ్చునని, కలుపు మందుని తగ్గించడం వల్ల పొలంలో ఉత్పత్తి 70 శాతం వరకు పెరుగుతుందన్నారు. ఒక ఎకరానికి రైతు సుమారు 25 వేల వరకు డబ్బులు ఆదా చేసుకోవచ్చున్నారు. ఈ అద్భుతమైన రోబోట్‌ని కొనాలనే రైతులకు 20 శాతం సబ్సిడీతో 3.5 లక్షల నుంచి 4.5 లక్షల రూపాయల వరకు వివిధ వెర్షన్‌లలో అందుబాటులో ఉన్నాయని కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్రీమంతుల వెంకటేశం, సొసైటీ చైర్మన్లు కోల రమేష్ గౌడ్, ఎల్లంకి మహిపాల్ రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ తిప్పని నాగేందర్, ఎంపిటిసి బెదురు తిరుపతి, బిఆర్‌ఎస్ నాయకుడు మామిడి వెంకటేష్ గౌడ్, జగ్గని బాబు, నాగారపు కృష్ణ, ఫామ్ సాథీ అంకుర సంస్థ కంపెనీ సిఈఓ సుశాంత్, సిటిఓ ఆదిత్య, కంపెనీ ప్రతినిధులు శ్రావణ్, విజయ్, వ్యవసాయ అధికారులు, రైతులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News