Monday, December 23, 2024

కేర్ హాస్పిటల్‌లో రోబో సాయంతో శస్త్ర చికిత్స

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రోబో సహాయంతో గచ్చిబౌలిలోని కేర్ హాస్పిటల్‌లో మొదటిసారిగా మోకాలి మార్పిడి శస్త్ర చికిత్స విజయవంతంగా నిర్వహించారు. ఇకపై కేర్ హాస్పిటల్‌లో మోకాలి మార్పిడి శస్త్రచికిత్సలకు అదునాతన సాంకేతికత జాన్సన్ అండ్ జాన్సన్ వెలిస్ రోబో అందుబాటులో ఉంటుందని హాస్పిటల్ ఆర్థోపెడిక్ విభాగాధిపతి, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ రత్నాకర్ రావు తెలిపారు. ‘వేలిస్ రోబో’తో మోకాలి మార్పిడి శస్త్రచికిత్స వల్ల కలిగే ప్రయోజానాల గురించి ఈ సందర్భంగా ఆయన వివరించారు.

రోబో సహాయంతో చేసే మోకాలి మార్పిడితో ఖచ్చితమైన కొలతలతో మోకాలి ఎముకలను చెక్కడం వలన అత్యంత ఖచ్చితత్వం తో ఇంప్లాంట్స్‌ని అమర్చవచ్చని, దీని వల్ల మోకాలి మార్పిడి తర్వాత కూడా నడిచేటప్పుడు తక్కువ నొప్పితో పాటు ,సహజమైన అనుభవం కలుగుతుంద అన్నారు. దీని వల్ల రోగులు త్వరగా కోలుకుంటారని తెలిపారు. కనీసం 20 సంవత్సరాలు పేషంట్‌కి ఏ ఇబ్బంది ఉండకుండా రోజువారీ కార్యక్రమాలు, వ్యాయామాలు ఎలాంటి నొప్పి లేకుండా చేసుకోగలగాలని, ఇందుకు రోబోటిక్ మోకాలి మార్పిడి శస్త్రచికిత్స చక్కని పరిష్కారమని వివరించారు.

గత 20సంవత్సరాలుగా మోకాలి మార్పిడి చికిత్సలో జరిగే ఇబ్బందులని ఈ సాంకేతికత వలన అధిగమించవచ్చని డాక్టర్ రత్నకర్ రావు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News