Friday, December 27, 2024

రెండు కేన్సర్లు వ్యక్తికి రోబోటిక్ సర్జరీ

- Advertisement -
- Advertisement -

తొలుత లుకేమియా… ఆపై పాంక్రియాటిక్ కేన్సర్
రోబోటిక్ సర్జరీ చేసి నయం చేసిన కిమ్స్ వైద్యులు

Robotic surgery to Cancer patient

మన తెలంగాణ,సిటీబ్యూరో: ఒకేసారి కేన్సర్ వస్తేసే కష్టం అనుకును పరిస్దితిలో అది పూర్తిగా తగ్గకుండానే మరో కేన్సర్ వస్తే సరిగ్గా ఇలాంటి పరిస్దితే ఎదురైన ఓవ్యక్తి హైదరాబాద్ కిమ్స్ ఆసుపత్రికి వచ్చారు. అతడికి వచ్చిన సమస్య చేసిన చికిత్సా విధానం గురించి ఆసుపత్రి సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్టు, రోబోటిక్ సర్జన్ డా. మధుదేవరశెట్టి వివరించారు. నగరంలోని ఫార్మారంగంలో పనిచేసే 36ఏళ్ల వ్యక్తికి ఎక్యూట్ ప్రోమైలోసిటిక్ లుకేమియా(ఏపిఎంఎల్) అంటే ఒక రకమైన రక్త కేన్సర్ వచ్చి దానికి కీమోథెరపీ తీసుకుంటున్నారు. అంతలో అతడికి కామెర్ల వ్యాధి వచ్చింది.

ఈవిషయం తెలుసుకోవడం రెండు,మూడు నెలలు ఆలస్యమైంది. సమస్య తీవ్రంగా ఉండటంతో అతడికి బయాప్సీ చేయించగా పాంక్రియాటిక్ కేన్సర్ అని తెలినట్లు తెలిపారు. దీంతో రెండో కేన్సర్ చికిత్స కోసం అతడు కిమ్స్ ఆసుపత్రికి వచ్చాడు. సమస్య తీవ్రత దృష్టా అతడికి రోబోటిక్ సర్జరీ చేయాలని నిర్ణయించినట్లు, తక్కువ సమయంలోనే సర్జరీకి తెసుకెళ్లామని, అత్యంత వేగంగా, కేవలం మూడున్నర గంటల కన్సోల్ టైంలో సర్జరీ పూర్తియింది. తరువాత ఒక రోజు మాత్రమే ఐసీయూలో, మర్నాడే రూంలోకి పంపేశాం, ఐదో రోజున డిశ్చార్జి చేసినట్లు వెల్లడించారు.

దేశంలో అత్యంత వేగవంతంగా జరిగిన రోబోటిక్ సర్జరీలో ఇదొకటని చెప్పవచ్చని, రోగి త్వరగా, చాలా బాగా కోలుకున్నట్లు చెప్పారు.ఈకేసులో ఓపెన్ సర్జరీ కంటే బయాప్సీ రిపోర్టు చాలా మెరుగ్గా ఉంది. సాధారణంగా 12 లింప్‌నోడ్లను తీస్తే సరిపోతుందని, అలాంటిది ఈ వ్యక్తి నుంచి 37 లింప్ నోడ్లను తీసినట్లు, దీనివల్ల అతడి పాంక్రియాస్‌లో కేన్సర్ ఉనికి దాదాపుగా ఉందన్నారు. పాంక్రియాటిక్ కేన్సర్లు వచ్చినప్పుడు సాధారణంగా ఓపెన్ సర్జరీ అయితే అతుక్కోవడం కూడా చాలా కష్టం అవుతుంది. కుట్లు వేయడం సాధ్యంకాదు. అందువల్ల రోగి కోలుకునే అవకాశాలు తక్కువని వైద్యులు చెబుతారు. అదే రోబోటిక్ సర్జరీ అయితే ఈసమస్యలేవి ఉత్పన్నం కావని తెలిపారు. ఈరోబోటిక్ సర్జరీలో ఆసుపత్రికి చెందిన వైద్యులు డా. వెంకటేష్, మాధవితో పాటు నర్సు స్వప్న పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News