Friday, November 22, 2024

వ్యవసాయంలో రోబోటిక్ టెక్నాలజీ: మంత్రి నిరంజన్‌రెడ్డి

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: వ్యవసాయరంగంలో రోబోటిక్ టెక్నాలని ఉపయోగింకుని అధిక దిగుబడుల దిశగా అడుగులు వేయాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. అమెరికాల పర్యటనలో ఉన్న మంత్రి శనివారం అక్కడ జరిగిన వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మెరుగైన వ్యవసాయ ఉత్పత్తులకోసం కృషి జరగాలన్నారు. బయోటెక్నాలజీ రంగానికి సంబంధించి జీనోమ్ ఎడిటింగ్, ఇతర జన్యు సాధనాల వంటి పరిశోధనల విషయాల్లో పరస్పర సహకారాలు ఉండాలన్నారు.

నేల నిర్వహణ, నేల ఆరోగ్య సంరక్షణ మెరుగుదలకు సంబంధించిన విషయాలలో సహాయ సహకారాలు అవసరం అన్నారు.తెలంగాణలో మరింత వ్యవసాయ అభివృద్ధి కోసం ప్రతిపాదనలను సిద్ధం చేసి సమర్పించాలని కోరారు. రోబోటిక్స్ , కృత్రిమ మేధ కు సంబంధించి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడంలో మేరిల్యాండ్ విశ్వవిద్యాలయం కీలక పాత్ర పోషిస్తున్నదన్నారు. వైద్యం, వ్యవసాయం లాంటి కీలక అంశాల్లో ఉపయోగకరమైన పరిశోధనలు, ఆవిష్కరణలు చేయడంలో మేరీల్యాండ్ యూనివర్సిటీ ప్రసిద్ధి చెందిందన్నారు.

అమెరికా పర్యటనలో భాగంగామేరీల్యాండ్ స్టేట్ యూనివర్సిటీని సందర్శించి,విశ్వవిద్యాలయం డీన్ మరియు డైరెక్టర్ క్రెయిగ్ బేరౌటీతో మంత్రి నిరంజన్‌రెడ్డి భేటీ అయ్యారు. ఈ సమావేశంలో తెలంగాణ వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, ఇస్టా అధ్యక్షులు, తెలంగాణ విత్తనాభివృద్ది సంస్థ ఎండీ కేశవులు, మేరీల్యాండ్ స్టేట్ యూనివర్సిటీ అసోసియేట్ డీన్ ఆఫ్ రీసెర్చ్, పునీత్ శ్రీవాస్తవ, డైరెక్టర్, ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్స్ జిమ్మీ స్మిత్ ఇంకా యూనివర్సిటీకి చెందిన ఇతర శాస్త్రవేత్తలు తదితరులు పాల్గొన్నారు.

అనంతరం తెలంగాణ రాష్ట్రం ,అంతర్జాతీయ ఆహార విధాన పరిశోధన సంస్థ (ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ – ) మధ్య వ్యవసాయ సహకారాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అమెరికాలోని వాషింగ్టన్ డీసీ లోని ఐఎఫ్‌పిఆర్‌ఐ ప్రధాన కార్యాలయంలో సంస్థ ప్రతినిధులతో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో డా. డేవిడ్ స్పీల్‌మాన్ డైరెక్టర్, ఇన్నోవేషన్ పాలసీ మరియు స్కేలింగ్, డా. పాల్ డోరోష్, ఐఎఫ్‌పిఆర్‌ఐ డెవలప్‌మెంట్ స్ట్రాటజీస్ అండ్ గవర్నెన్స్ డైరెక్టర్, తెలంగాణ వ్యవసాయ శాఖ సెక్రెటరీ రఘునందన్ రావు, ఇస్టాఅధ్యక్షులు, తెలంగాణ విత్తనాభివృద్ది సంస్థ ఎండీ కేశవులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News