- Advertisement -
నాగర్‌కర్నూల్: ఎస్‌ఎల్‌బిసి టన్నెల్‌లో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇప్పటికే టన్నెల్ నుంచి ఒకరి మృతదేహాన్ని వెలికితీశారు. మిగిలిన ఏడుగురి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మానవ ప్రయత్నాలతో పాటు.. ఇప్పుడు రోబోలను కూడా సహాయకచర్యల్లో భాగం చేశారు. 18వ రోజు సహాయకచర్యల్లో రోబోలు వాటి బృందాలు అనుమానిత ప్రాంతంలో ప్రవేశించి తవ్వకాలు చేస్తున్నాయి. మరోవైపు లోకో ట్రైన్‌లో బృందాలు టన్నెల్ లోపలికి వెళ్లి గాలిస్తున్నాయి. కేరళ నుంచి వచ్చిన కాడవర్ జాగిలాలు కూడా తమవంతు సహాయం అందిస్తున్నాయి. 14 బృందాలు ఈ సహాయక చర్యల్లో పాల్గొంటుండగా.. సింగరేణి కార్మికులు ఇందులో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఆదివారం రాబిన్స్ కంపెనీలో టిబిఎం ఆపరేటర్‌గా పని చేస్తున్న గురుప్రీత్ సింగ్ మృతదేహం లభించగా.. మిగితా ఏడుగురి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
- Advertisement -