Wednesday, January 22, 2025

పంజాబ్ సరిహద్దుల్లో పోలీస్ స్టేషన్‌పై రాకెట్ లాంఛరతో దాడి

- Advertisement -
- Advertisement -

చండీగఢ్ : పంజాబ్ లోని భారత్‌పాక్ సరిహద్దు జిల్లా తరన్‌తరన్ లోని ఓ పోలీస్ స్టేషన్‌పై శుక్రవారం అర్థరాత్రి దాడి జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు రాకెట్ లాంచర్ సాయంతో గ్రనేడ్‌తో దాడి చేసినట్టు అధికారిక వర్గాలు వెల్లడించాయి. దీని వెనుక ఉగ్రవాదుల హస్తం ఉన్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దాడి జరిగిన సమయంలో పోలీస్ స్టేషన్‌లో కొంతమంది సిబ్బంది మాత్రమే ఉన్నారు.

హైవే నుంచి ఈ రాకెట్ ప్రొపెల్డ్ గ్రనేడ్‌ను ప్రయోగించినట్టు పోలీసులు చెప్పారు. అయితే గ్రనేడ్ పేలక పోవడంతో ఎవరికీ ఎలాంటి హాని జరగలేదని చెప్పారు. లాంఛర్ కారణంగా పోలీస్ స్టేషన్ స్వల్పంగా ధ్వంసమైంది. ఈ దాడికి తామే కారణమని ఖలిస్థానీ ఉగ్రముఠా ప్రకటించింది. అయితే దీన్ని సెక్యూరిటీ ఏజెన్సీలు ధ్రువీకరించలేదు. దీని వెనుక సీమాంతర ఉగ్రవాదుల హస్తం ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

స్థానిక గ్యాంగ్‌స్టర్లు, ఉగ్రముఠాలతో కలిసి ఈ దాడికి ప్రయత్నించి ఉండొచ్చని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. సర్హలీ ప్రాంతం ..ఖలిస్థానీ ఉగ్రవాది హర్వీందర్ సింగ్ రిండా స్వస్థలం. అతడు ఇటీవల పాకిస్థాన్‌లో మృతి చెందినట్టు వార్తలు వస్తున్నా దానిపై కచ్చితమైన ఆధారాలు లేవు.ఈ ఏడాది మేనెలలో ఇదే తరహాలో పంజాబ్ పోలీస్ ఇంటెలిజెన్స్ విభాగ ప్రధాన కార్యాలయంపై జరిగిన రాకెట్ ప్రొఫైల్డ్ గ్రనేడ్ దాడిలో ఇతడి హస్తం కూడా ఉన్నట్టు తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News