Monday, January 27, 2025

డొనెట్స్క్‌లోని మేయర్ కార్యాలయంపై రాకెట్ల దాడి

- Advertisement -
- Advertisement -

Russia Attack

కీవ్:  క్రెమ్లిన్ అనుకూల వేర్పాటువాదుల నియంత్రణలో ఉన్న కీలకమైన తూర్పు ఉక్రెయిన్ నగరంలో మేయర్ కార్యాలయం ఆదివారం ఉదయం రాకెట్లతో దాడికి గురైనట్లు రష్యా ప్రభుత్వ ఏజెన్సీలు నివేదించాయి. ప్రాణనష్టం గురించి తక్షణ నివేదికలు లేవు. ఆర్ఐఏ నోవోస్టి ప్రకారం, డోనెట్స్క్‌లోని మునిసిపల్ భవనం దాడి వల్ల తీవ్రంగా దెబ్బతింది, స్థానిక వేర్పాటువాద అధికారులు ఉక్రెయిన్‌పై నిందలు వేశారు.

సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న ఫోటోలు… భవనం చుట్టూ పొగలు కమ్ముకున్నట్లు,విరిగిన కిటికీల వరుసలు , పాక్షికంగా కూలిపోయిన పైకప్పును చూపించాయి. సమీపంలో ఆపి ఉంచిన మూడు కార్లు కాలిపోయాయని ఆర్ఐఏ నోవోస్టి, స్థానిక మీడియా తెలిపాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News