- Advertisement -
ఆయన మీడియం పేసర్… 1983లో భారతదేశ జట్టు చారిత్రాత్మక ప్రపంచ కప్ విజయానికి కారకులలో ఒకరు.
ముంబై: భారత మాజీ క్రికెటర్, 1983 ప్రపంచకప్ విజేత-జట్టు సభ్యుడు రోజర్ బిన్నీ మంగళవారం 36వ బిసిసిఐ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. సౌరవ్ గంగూలీ నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఆయన 1983 ప్రపంచ కప్‌లో భారత చారిత్రక విజయానికి మీడియం పేసర్‌గా తోడ్పడ్డారు. ఎనిమిది గేమ్స్‌లో ఆయన 18 వికెట్లు తీసుకున్నారు. ఆ ప్రతిష్టాత్మక టోర్నమెంటు ఎడిషన్‌లో అదే హైయెస్ట్. బిన్నీ సెలక్షన్ కమిటీలో సీనియర్ సభ్యుడిగా కూడా పనిచేశారు. అప్పట్లో సందీప్ పాటిల్ చైర్మన్‌గా ఉండేవారు. ఆయన కుమారుడు స్టూవర్ట్ బిన్నీ పేరు సెలక్షన్ చర్చకు వచ్చినప్పుడు ఆయన ఆ ప్రొసీడింగ్స్ నుంచి తప్పించుకునేవారు.
- Advertisement -