బిసిసిఐ చీఫ్ పదవిపైనే గంగూలీ ఆసక్తి
ఐపిఎల్ చైర్మన్ ఆఫర్‌కు నో
అధ్యో రేసులోరోజర్ బిన్నీ
రసవత్తరంగా మారిన బోర్డు ఎన్నికలు!
ముంబై: ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డుగా పేరున్న భారత క్రికెట్ బోర్డు (బిసిసిఐ)లో ఎన్నికల పక్రియకు తెరలేచిన విషయం తెలిసిందే. బిసిసిఐలోని పలు పదవులకు త్వరలో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే నామీనేషన్ల పక్రియ ప్రారంభమైంది. ఈసారి బిసిసిఐ అధ్యక్ష పదవి రేసులో భారత మాజీ క్రికెటర్ రోజర్ బిన్నీ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.
1983లో ప్రపంచకప్ సాధించిన టీమిండియాలో రోజర్ బిన్నీ సభ్యుడిగా ఉన్నారు. అలనాటి భారత ఆల్‌రౌండర్లలో ఒకరిగా బిన్నీ పేరు తెచ్చుకున్నారు. ఈసారి బిసిసిఐ అధ్యక్ష పదవి బిన్నీకే దక్కుతుందని అందరూ భావిస్తున్నారు. అయితే ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న సౌరవ్ గంగూలీ తన పదవిని విడిచి పెట్టేందుకు అంగీకరించడం లేదని తెలుస్తోంది. మరోసారి బిసిసిఐ చీఫ్‌గా వ్యవహరించాలని గంగూలీ భావిస్తున్నాడు. అయితే బిసిసిఐ పెద్దలు మాత్రం గంగూలీకి ఐపిఎల్ చైర్మన్ పదవి అప్పగించాలనే ఉద్దేశంతో ఉన్నారు. కానీ గంగూలీ మాత్రం దీనికి సమ్మతించడం లేదు. ఇలాంటి స్థితిలో బిసిసిఐ ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
Roger Binny likely to be elected as BCCI President