Sunday, November 24, 2024

రోహిణీ కోర్టు పేలుడు కేసు.. డిఆర్‌డిఒ శాస్త్రవేత్త అరెస్ట్

- Advertisement -
- Advertisement -

Rohini court blast case: DRDO scientist arrested

న్యూఢిల్లీ : ఢిల్లీ లోని రోహిణి కోర్టులో ఇటీవల జరిగిన పేలుడు సంఘటనకు సంబంధించి ఓ డిఆర్‌డీవో శాస్త్రవేత్తను ఢిల్లీ స్పెషల్ పోలీస్ సెల్ శనివారం అరెస్టు చేసింది. న్యాయ వివాదాల నేపథ్యంలో ఓ లాయర్‌ను హతమార్చేందుకే ఈ పేలుడుకు పాల్పడినట్టు సమాచారం. సీసీ కెమెరా ఫుటేజీలు, ఘటన జరిగిన సమయంలో ఆ న్యాయవాది కోర్టు లోనే ఉండటం, బ్యాగ్‌పై ఓ కంపెనీ లోగో తదితర ఆధారాలతో నిందితుడిని అరెస్టు చేసినట్టు అధికారులు వెల్లడించారు. న్యాయ వివాదాలు తనను మానసికంగా కలవరపెట్టాయని, ఈ కారణం గానే లాయర్‌ను హత్య చేయాలనే ఉద్దేశంతో టిఫిన్ బాక్స్ బాంబు పేలుడుకు పథకం పన్నానని నిందితుడు అంగీకరించినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. పేలుడు పదార్ధాల తయారీ పరిజ్ఞానం కూడా తనకు ఉన్నట్టు నిందితుడు ఒప్పుకున్నాడని చెప్పాయి.

మరోవైపు ఆ న్యాయవాది, … నిందితుడిపై 10 కేసులు నమోదు చేసినట్టు ఓ అధికారి తెలిపారు. డిసెంబర్ 9 న కోర్టు లోని రూం నంబర్ 102 లో జరిగిన ఈ పేలుడులో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున శబ్దం రావడంతో అక్కడున్నవారు భయాందోళనలతో పరుగులు పెట్టారు. అంతకు ముందు సెప్టెంబరు లోనూ ఇదే కోర్టు ఆవరణలో ఓ గ్యాంగ్‌స్టర్‌పై ప్రత్యర్థి గ్యాంగ్ కాల్పులు జరిపి హత్య చేసని విషయం తెలిసిందే. అదే సమయంలో పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు దుండగులు హతమయ్యారు. దీంతో ఈ కోర్టులో భద్రతా చర్యల నిర్లక్షంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News