Monday, December 23, 2024

రోహిణి కార్తె ప్రారంభం

- Advertisement -
- Advertisement -

మనతెలగాణ/హైదరాబాద్: రోహిణి కార్తె గురువారం నుంచి ప్రారంభమయ్యింది. ఈ నెల 11నుంచి ప్రారంభమైన కృత్తిక కార్తె బుధవారం నాటితో ముగిసిపోయింది. రోహిణి కార్తె జూన్ 7 వతేది వరకూ కొనసాగనుంది. రోహిణి కార్తెలో రోళ్లు పగిలే ఎండలు ఉంటాయన్న నానుడికి ఈ సారి అవకాశం అంతగా ఉండదని భావిస్తున్నారు. అడపా దడపా వర్షాలు కురుస్తుండటంతో వాతావరణంలో ఉష్ణొగ్రతలు కాస్త నెమ్మదిస్తున్నాయి. ఇదే విధమైన వాతావరణం కొనసాగితే రోహిణి కార్తెలో ఎండల తీవ్రత పెరిగే అవకాశం ఉండదని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News