Thursday, December 26, 2024

పొట్టి క్రికెట్‌కు రోహిత్, జడేజా వీడ్కోలు

- Advertisement -
- Advertisement -

ముంబై : 17 ఏళ్ల తర్వాత టి20 ప్రపంచకప్‌ను టీమిండియా కైవసం చేసుకోవడంతో సంబరాల్లో ఉన్న భారత క్రికెట్ అభిమానులకు షాక్ గురిచేశాడు సారధి రోహిత్ శర్మ. విరాట్ కోహ్లి బాటలోనే రోహిత్, రవీంద్ర జడేజా టి20లకు రిటైర్మెంట్ ప్రకటించారు. దీంతో తమ అభిమాన ఆటగాళ్లు ముగ్గురు టి20ల్లో మళ్లీ కనిపించరని అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు. అయితే వీరిద్దరూ వరల్డ్ కప్ విజయంతో వీడ్కోలు పలకడంతో అభిమానులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక, టి20ల నుంచి రిటైరైనప్పటికీ వన్డే, టెస్టు క్రికెట్‌లో మాత్రం కొనసాగుతానని రోహిత్ స్పష్టం చేశాడు. ‘టీ20 క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకుంటానని ఎప్పుడూ అనుకోలేదు. అయితే ప్రస్తుత పరిస్థితుల దృష్టా ఈ నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలాగే టీ20 ప్రపంచకప్‌కు వీడ్కోలు పలికేందుకు ఇంతకంటే మంచి సమయం మరొకటి రాదు. అలాగే 100 శాతం ఐపిఎల్‌లో ఆడతాను’ అని హిట్ మ్యాన్ చెప్పుకొచ్చాడు.

రోహిత్ టి20 కెరీర్..

ఇప్పటి వరకు టి20ల్లో 4,231 వ్యక్తిగత పరుగులు సాధించిన రోహిత్ అత్యధిక సెంచరీలు 5, అత్యధిక సిక్సర్లు 205 బాదిన రికార్డులు సయితం హిట్ మ్యాచ్‌పైనే ఉన్నాయి. అంతేకాకుండా టీమిండియా ఇప్పటి వరకూ రెండు టి20 ప్రపంచకప్‌లు గెలువగా రెండింటిల్లో ఉన్న ఏకైక ఆటగాడు రోహితే. టి20 ప్రపంచకప్ ప్రారంభం నుంచి రోహిత్ ఇప్పటి వరకు 9 ఎడిషన్లలో ఆడిన ఏకైక భారత ఆటగాడు కావటం విశేషం. టెస్టులు, వన్టేలు, టీ20ల్లో మొ త్తం కలిపి 612 సిక్సర్లు కొట్టిన ఏకైక బ్యాటర్ రోహితే మాత్రమే. ఈ రికార్డును బద్దలు కొట్టేందుకు దరిదాపుల్లో ఎవరూ లేరు.

టి20ల్లో మోస్ట్ సక్సెస్ ఫుల్ సారధి

రోహిత్ శర్మ 61 ఐసిసి టి20లకు సారధిగా వ్యవహరించగా వాటిలో 50 విజయాలు ఉండటం విశేషం. ఇక టి20 ప్రపంచ కప్ లో రోహిత్ శర్మ 13 టి20లకు సారధిగా 11 మ్యా చ్‌ల్లో విజయం అందించాడు టీ మిండియాకు. ఐపిఎల్‌లోనూ అ త్యంత విజయవంతమైన కెప్టెన్‌గా రోహిత్‌కు రికార్డు ఉంది. ఇక వన్డే వరల్డ్ కప్‌లో రోహిత్ సారధ్యంలో టీమిండియా 11 మ్యా చ్‌లు ఆడగా అందులో 10 మ్యాచ్‌లలో భారత్ జయకేతనం ఎగురవేసింది. టెస్టుల్లో 16 మ్యాచ్‌లకు కెప్టెన్సీ చేయగా రెం డు డ్రా అయ్యాయి. మిగిలిన 14లో 10 భారత్ గెలిచింది. ఇక వన్డేల్లో 45 మ్యాచ్‌లకు రోహిత్ కెప్టెన్‌గా వహిస్తే 34 మ్యాచ్‌లను టీమిండియా గెలుపొందింది. మొత్తంగా టీమిండియాకు 92 విజయాలందించిన సక్సెస్‌ఫుల్ కెప్టెన్‌గా రోహిత్ పేరు తెచ్చుకున్నాడు.

టి20లకు జడేజా గుడ్‌బై!

ముంబై : టీమిండియాలో మరో స్టార్ ఆటగాడు రిటైర్మెంట్ బాట పట్టాడు. అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలుకుతున్నట్లు ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ప్రకటించాడు. గత 24 గంటల వ్యవధిలో టీ20లకు గుడ్‌బై పలికిన మూడో భారత ప్లేయర్ జడేజా! టీ20 వరల్ కప్‌ను గెలిచిన అనంతరం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి కూడా పొట్టి ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. టి20 ఫార్మాట్‌కు గుడ్‌బై అంటూ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా 35 ఏళ్ల రవీంద్ర జడేజా ఆదివారం ప్రకటించాడు. టి20 ప్రపంచకప్ గెలిచి తన కలను నెరవేర్చుకున్నాని భావోద్వేగంతో జడ్డూ పోస్ట్ పెట్టాడు. ‘కృతజ్ఞతతో నిండిన హృదయంతో అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలుకుతున్నాను. పొగరుతూ దూసుకెళ్లే గుర్రంలా నేనెప్పుడూ దేశం కోసం నా అత్యుత్తమ ప్రదర్శన చేశాను. అదే జోరును ఇతర ఫార్మాట్లలో కొనసాగిస్తా. టీ20 ప్రపంచ కప్‌ను అందుకోవాలనుకున్న నా కల నెరవేరింది’ అని జడేజా పేర్కొన్నాడు. ఇక భారత్ తరఫున 2009లో అరంగేట్రం చేసిన జడేజా 74 టీ20లు ఆడాడు. 41 ఇన్నింగ్స్‌ల్లో 21 సగటుతో 515 పరుగులు చేశాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News