Monday, January 13, 2025

IND vs AUS 2nd Test: రోహిత్, కోహ్లీ మళ్లీ ఫెయిల్..

- Advertisement -
- Advertisement -

అడిలైడ్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలు మరోసారి విఫలమయ్యారు. తొలి ఇన్నింగ్స్‌లో రోహిత్, కోహ్లిలు సింగిల్ డిజిట్‌కే పెవిలియన్ చేరిన విషయం తెలిసిందే. కనీసం రెండో ఇన్నింగ్స్‌లోనైనా ఇద్దరు జట్టుకు అండగా నిలుస్తారని భావిస్తే నిరాశే మిగిలింది. ఈసారి కూడా ఇద్దరు తేలిపోయారు.

కోహ్లి 11 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యాడు. కెప్టెన్ రోహిత్ ఆరు పరుగులు మాత్రమే చేశాడు. ఇక మరో సీనియర్ కెఎల్ రాహుల్ కూడా నిరాశ పరిచాడు. రాహుల్ కూడా సింగిల్ డిజిట్ స్కోరుకే వెనుదిరిగారు. దీంతో అడిలైడ్‌లో జరుగుతున్న పింక్‌బాల్ టెస్టులో భారత్‌కు ఓటమి ఖాయంగా కనిపిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News