Wednesday, January 22, 2025

రోహిత్ సెంచరీ… టీమిండియా 190/3

- Advertisement -
- Advertisement -

రాజ్‌కోట్: సౌరాష్ట్ర క్రికెట్ స్టేడియంలో భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్ మొదటి రోజు టీమిండియా 53 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 190 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. రోహిత్ శర్మ శతకంతో విజృంభించాడు. రవీంద్ర జడేజా హాఫ్ సెంచరీతో ఆదుకున్నాడు. భారత బ్యాట్స్‌మెన్లలో యశస్వి జైస్వాల్ (10), రజత్ పాటీదర్(05), శుభమన్ గిల్(0) పరుగులు చేసి ఔటయ్యారు. రోహిత్, జడేజా మూడో వికెట్‌పై 157 పరుగుల భాగస్వామ్యం నెలకొలప్పారు. ఇంగ్లాండ్ బౌలర్లలో మార్క్ వుడ్ రెండు వికెట్లు పడగొట్టగా టామ్ హార్ట్ లే ఒక వికెట్ తీశాడు. ప్రస్తుతం క్రీజులో రోహిత్ శర్మ(102), రవీంద్ర జడేజా(68) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

ఇప్పటి వరకు రోహిత్ శర్మ టెస్టుల్లో 11 సెంచరీలు మాత్రమే చేశాడు. టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదిన రెండో భారత క్రికెటర్‌గా రోహిత్ శర్మ(79) రికార్డు సృష్టించాడు. టెస్టుల్లో మాజీ కెప్టెన్ ధోనీ 78 సిక్స్ లతో మూడో స్థానానికి పడిపోయాడు. టెస్టుల్లో 91 సిక్స్‌లతో వీరేంద్ర సెహ్వాగ్ తొలి స్థానంలో ఉన్నాడు. టెస్టులో 128 సక్స్ లతో ఇంగ్లాండ్ బెన్స్ స్టోక్స్ తొలి స్థానంలో ఉన్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News