Thursday, January 16, 2025

‘మీకు రోహిత్ అంటే దడా’.. అస్ట్రేలియా మీడియాపై ఫ్యాన్స్ ఫైర్

- Advertisement -
- Advertisement -

టీమిండియా కెప్టెన్, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ అభిమానులు ఆస్ట్రేలియా మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వచ్చే నెల(నవంబర్)లో భారత్-ఆస్ట్రేలియా జట్ల మద్య బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ జరగనున్న సంగతి తెలిసిందే. ఐదు టెస్టుల సిరీస్ లో ఆస్ట్రేలియాను వారి సొంతగడ్డపై భారత్ ఢీకొనబోతోంది. గతంలో రెండుసార్లు ఈ ట్రోఫీలో భాగంగా జరిగిన సిరీస్ లను కోహ్లీ నాయకత్వంలో టీమిండియా కైవసం చేసుకుంది.

ఇక, మూడోసారి కూడా సిరీస్ ను గెలిచి సత్తా చాటాలని భారత్ భివిస్తోంది. అయితే, రెండు సార్లు సిరీస్ లను కోల్పోయిన ఆసీస్ మాత్రం ఈసారి సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. మూడోసారి జరగనున్న సిరీస్ లో భారత్ ను ఓడించాలని ఇప్పటి నుంచే ప్రణాళికలు రచిస్తోంది. దీంతో ఈ సిరీస్ పై అందిరిలో ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియా మీడియా ‘ఫాక్స్ క్రికెట్’.. ఈ ట్రోఫీకి సంబంధించి విశ్లేషణలతో కూడిన ఓ వీడియోతో పాటు పోస్టర్ ను విడుదల చేసింది.

అయితే, ఈ పోస్టర్ లో విరాట్ కోహ్లీని హైలెట్ చేస్తూ కెప్టెన్ రోహిత్ ను పక్కకు పెట్టడంపై అభిమానులు ఫైరవుతున్నారు. పైగా థంబ్‌నైల్‌లో కోహ్లీ నాయకత్వంలోని భారత జట్టు అని పెట్టడడంతో రోహిత్ ఫ్యాన్స్ ఆసీస్ మీడియాపై విమర్శలు చేస్తున్నారు. ఇక, పోస్టర్ లో సీనియర్‌ క్రికెటర్లు అజింక్య రహానే, చేటేశ్వర్ పుజారా, ఇషాంత్ శర్మలను కూడా పెట్టారు. ప్రస్తుతం భారత్ సారథిగా రోహిత్ శర్మ ఉన్నాడని, అతని నాయకత్వంలోనే టీమిండియా, ఆస్ట్రేలియాలో పర్యటించనుందని.. అలాంటప్పుడు కోహ్లీని హైలెట్ చేస్తూ థంబ్ నైల్ పెట్టడం సరికాదంటూ కామెంట్స్ చేస్తున్నారు. “రోహిత్‌ను చూస్తుంటే మీకు దడగా ఉన్నట్లు అనిపిస్తోంది” లని ఫ్యాన్స్ ఆస్ట్రేలియా మీడియాపై విరుచుకుపడుతున్నారు. “మీకు రోహిత్ శర్మ గురించి తెలియదు.. ఈ సారి కూడా మీకు ఓటమి తప్పదు” అంటూ మండిపడుతున్నారు రోహిత్ అభిమానులు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News