Wednesday, January 22, 2025

రోహిత్ రెడ్డిపై ఇడి ప్రశ్నల వర్షం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : మనీలాండరింగ్ కేసులో నోటీసులు అందుకున్న తాండూరు ఎంఎల్‌ఎ పైలెట్ రోహిత్ రెడ్డి ఇడి విచారణ ముగిసింది. హైదరాబాద్‌లోని ఇడి కార్యాలయానికి సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు రోహిత్‌రెడ్డి చేరుకోగా దాదాపు 6 గంటలుగా అధికారులు ఆయననను ప్రశ్నించారు. అనంతరం మంగళవారం మరోసారి వి చారణకు రావాలని సూచించారు. ఇడి విచారణ అనంతరం బయటికొచ్చిన ఎంఎల్‌ఎ రోహిత్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఇడి అధికారులు తన వ్యక్తిగత, కు టుంబ వివరాలు అడిగి తెలుసుకున్నారన్నారు. తన వ్యా పార వివరాలు, ఫ్యామిలీ వివరాలు అడిగారని తెలిపారు. అ ధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పానని తె లిపారు. ఏ కేసులో నన్ను పిలుస్తున్నారనేది ఇప్పటివరకు ఇ డి అధికారులు స్పష్టత ఇవ్వలేదన్న ఆయన మంగళవారం మళ్లీ విచారణకు హాజరు కావాలని ఆదేశాలు ఇచ్చారన్నా రు.

దర్యాప్తు సంస్థల మీద తనకు గౌరవం ఉందని, మంగళవారం ఉదయం 10.30కు మరోసారి విచారణకు వస్తానని స్పష్టం చేశారు. అంతకు ముందు రోహిత్ రెడ్డి విచారణకు హాజరవుతారా? లేదా? అనే విషయంలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. సోమవారం ఉదయం పదిన్నరకు మణికొండలోని తన నివాసం నుంచి బయలుదేరిన రో హిత్ రెడ్డి నేరుగా ప్రగతి భవన్‌కు వెళ్లి ముఖ్యమంత్రి కెసిఆర్‌తో సమావేశమయ్యారు. పిఎ శ్రవణ్‌తో ఇడి అధికారులకు లేఖ పంపిన రోహిత్ రెడ్డి తాను అయ్యప్ప మాల ధరించానని, ఈ వారంలో మహాపడిపూజ ఉందని, దానికి సంబంధించిన ఏర్పాట్లను చూసుకోవాల్సి ఉందని లేఖలో పేర్కొన్నారు. అంతేకాకుండా నోటీసుల్లో కోరిన వివరాలన్నీ ఇవ్వడానికి 3 రోజుల వ్యవధి సరిపోలేదని సమాచారం అంతా ఇ వ్వడానికి వారం రోజుల గడువు కావాలని రోహిత్ రెడ్డిలేఖ లో కోరారు. ఈ విజ్ఞప్తిని ఇడి తిరస్కరించిందని పిఎ ద్వారా సమాచారం అందుకున్న రోహిత్ రెడ్డి సోమవారం మధ్యా హ్నం విచారణకు హాజరయ్యారు.

హైదరాబాద్‌లో ఇడి కార్యాలయంలో విచారణకు హాజరు కావాలంటూ సహాయ సంచాలకుడు దేవేందర్ సింగ్ పేరిట గత శుక్రవారం అధికారులు రోహిత్ రెడ్డికి సమన్లు జారీచేశారు. రోహిత్ రెడ్డికి ఇచ్చిన నోటీసులో ఆధార్, పాన్‌కార్డు, పాస్‌పోర్టుతో పాటు తనకు, తన కుటుంబానికి చెందిన బ్యాంకుకు సంబంధించి పూర్తివివరాలు, ఇతర వ్యాపారాలు ఏమైనా ఉంటే దానికి సంబంధించిన వివరాలు ఇవ్వాలని కోరారు. ఆదాయ పన్ను చెల్లిం పులతో పాటు ఇతర క్రయ విక్రయాలకు సంబంధించి గత ఏడేళ్ల సమాచారాన్ని ఇవ్వాల్సిందిగా కోరారు. ఇడి నోటీసుల విచారణ ఉదయం పదిన్నరకు హాజరుకావాల్సి ఉం డగా అదేసమయంలో మణికొండలోని తన నివాసం నుంచి బయలుదేరిన ఎంఎల్‌ఎ రోహిత్ రెడ్డి నేరుగా ప్రగప్రతిభవన్‌కు వెళ్లారు. ఆ తర్వాత 12 గంటల సమయంలో ప్రగతి భవన్ నుంచి బయటికి వెళ్లారు. ఇడి అధికారుల నిర్ణయాన్ని పైలెట్ రోహిత్ రెడ్డికి పిఎ శ్రవణ్ చెప్పిన తర్వాతనే ప్రగతి భవన్ నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News