Wednesday, January 22, 2025

రోహిత్ నయా రికార్డ్

- Advertisement -
- Advertisement -

హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ అరుదైన పీట్‌ను అందుకున్నాయి. టి20 క్రికెట్ చరిత్రలో 11 వేల పరుగుల చేసిన రెండో భారత క్రికెటర్‌గా రోహిత్ శర్మ రికార్డుల్లోకి ఎక్కాడు. ఆదివారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో రోహిత్ శర్మ 37 బంతుల్లో 1 సిక్సర్, 8 ఫోర్లతో 56 పరుగులు చేసిన రోహిత్ మయాంక్ డాగర్ బౌలింగ్‌లో నితీశ్ రెడ్డికి క్యాచ్ ఇచ్చి క్రీజు వదిలాడు. కాగా, రోహిత్ కంటే ముందు భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ 11 వేల పరుగుల పూర్తి చేసుకోగా, ప్రస్తుతం కోహ్లీ 11,864 పరుగులతో టీ20 క్రికెట్ చరిత్రలో 11 వేల పరుగులు దాటిన తొలి ఇండియన్‌గా ఉన్నాడు. రోహిత్ శర్మ 11,021 పరుగులతో ఆ తర్వాత స్థానంలో ఉన్నాడు. అదేవిధంగా ఐపిఎల్‌లో ముంబై ఇండియన్స్ జట్టు తరఫున 5 వేల పరుగులు చేసిన ఆటగాడిగా కూడా రోహిత్ నయా రికార్డు నెలకొల్పాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News