- Advertisement -
టీమిండియా ప్రధాన కోచ్ గౌతం గంభీర్‌తో తనకు ఎలాంటి విభేదాలు లేవని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్పష్టం చేశాడు. కోచ్‌తో తనకు మనస్పర్థలు ఉన్నాయని సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదన్నాడు. గంభీర్ అంటే తనకు ఎంతో గౌరవమన్నాడు. అతని పర్యవేక్షణలో జట్టు ప్రయాణం సాఫీగా సాగుతుందన్నాడు. కోచ్‌గా గంభీర్ తన బాధ్యతలను చాలా సక్రమంగా నిర్వర్తిస్తున్నాడన్నాడు.
ఇక ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేసిన జట్టుపై రోహిత్ పూర్తి సంతృప్తి వ్యక్తం చేశాడు. టోర్నీకి ఎంపికైన ప్రతి ఆటగాడిలో అపార ప్రతిభ దాగివుందన్నాడు. షమి మళ్లీ జట్టులోకి రావడం ఆనందంగా ఉందన్నాడు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని గిల్‌కు కీలకమైన వైస్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించామన్నాడు. మెగా టోర్నమెంట్‌లో భారత్‌ను విజయపథంలో నడిపించడమే లక్షంగా ముందుకు సాగుతానని రోహిత్ శర్మ పేర్కొన్నాడు.
- Advertisement -