Thursday, July 4, 2024

రోహిత్, కోహ్లిల లోటును పూడ్చేదెవరో?

- Advertisement -
- Advertisement -

ముంబై: వెస్టిండీస్ వేదికగా జరిగిన టి20 ప్రపంచకప్‌లో టీమిండియా ట్రోఫీని సొంత చేసుకున్న సంగతి తెలిసిందే. ఫైనల్ మ్యాచ్ ముగిసిన వెంటనే భారత దిగ్గజ క్రికెటర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలు అంతర్జాతీయ టి20 క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. దీంతో ఈ ద్వయం లేని లోటును ఎవరూ భర్తీ చేస్తారనే అంశం చర్చనీయాంశంగా మారింది. భారత క్రికెట్‌పై కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ సారథి విరాట్ కోహ్లిలు తమదైన ముద్ర వేసిన విషయం తెలిసిందే. వీరిద్దరూ ఒకే సారి టి20 ఫార్మాట్‌కు వీడ్కోలు పలికారు.

దీంతో వీరి స్థానాన్ని భర్తీ చేసే క్రికెటర్లు ఎవరనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఐపిఎల్ టోర్నమెంట్ ద్వారా టీమిండియాలో ఎంతో మంది ప్రతిభావంతులైన ఆటగాళ్లు వెలుగులోకి వస్తున్నారు. అయితే వీరిలో కొందరూ మాత్రమే టీమిండియాలో స్థానాన్ని శాశ్వతం చేసుకుంటున్నారు. ఇలాంటి స్థితిలో అద్భుత క్రికెటర్లుగా పేరు తెచ్చుకున్న కోహ్లి, రోహిత్‌ల మాదిరిగా టీమిండియాపై తమదైన ముద్ర వేసే ఆటగాళ్లు ఎవరనే దానిపై చర్చ మొదలైంది. అయితే శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, అభిషేక్ శర్మ, కెఎల్ రాహుల్ వంటి ప్రతిభావంతులు ఉండడం టీమిండియాకు ఊరటనిచ్చే అంశంగా చెప్పాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News