Sunday, January 19, 2025

జూనియర్ హిట్ మ్యాన్ వచ్చేశాడు..

- Advertisement -
- Advertisement -

టీమిండియా కెప్టెన్, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ రెండో సారి తండ్రయ్యారు. శుక్రవారం(నవంబర్ 15) రోహిత్ భార్య రితికా సజ్దే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. రోహిత్, రితికలకు ఇది రెండవ సంతానం. ఇప్పటికే వీరికి కూతురు జన్మించిన సంగతి తెలిసిందే. మరోసారి త్రండైన రోహిత్ కు ప్రముఖ క్రికెటర్లు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

కాగా, ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ లో భాగంగా రోహిత్ మొదటి టెస్టు మ్యాచ్ కు దూరం కానున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. తన భార్య డెలివరీ కారణంగా రోహిత్ అందుబాటులో ఉంటాడా? లేదా అనే దానిపై కోచ్ గౌతమ్ గంభీర్ కూడా స్పష్టత ఇవ్వలేకపోయాడు. ఇప్పటికే టీమిండియా ఆటగాళ్లు ఆస్ట్రేలియా వెళ్లి ప్రాక్టీస్ కూడా మొదలెట్టారు. అయితే, రోహిత్ మాత్రం ఇంకా ఇండియాలోనే ఉన్నారు. ముంబై స్టేడియంలోనే ప్రాక్టీస్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. తాజాగా రోహిత్త భార్య మగ బిడ్డకు జన్మనివ్వడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి రోహిత్ తొలి టెస్టు ఆడుతాడో లేదో చూడాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News