- Advertisement -
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చాలా రోజుల తర్వాత ధనాధన్ బ్యాటింగ్ శతక్కొట్టాడు. ఇంగ్లండ్ జట్టుతో జరుగుతున్న రెండో వన్డేలో రోహిత్ సూపర్ సెంచరీతో విరుచుకుపడ్డాడు. 90 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్సులతో 119 పరుగులు చేశాడు. ఈక్రమంలో వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ క్రిస్ గేల్ రికార్డు బద్దలు కొట్టాడు రోహిత్.
వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక సిక్స్‌లు (338) బాదిన రెండో బ్యాటర్‌గా హిట్ మ్యాన్ రికార్డు నెలకొల్పాడు. అంతకుముందు క్రిస్ గేల్, రోహిత్ సంయుక్తంగా 331 సిక్సులతో రెండో స్థానంలో ఉన్నారు. ఈ జాబితాలో పాక్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది 351 సిక్స్‌లతో అగ్రస్థానంలో ఉన్నాడు. త్వరలో ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానున్న నేపథ్యంలో అఫ్రిది రికార్డును కూడా రోహిత్ బద్దలు కొట్టే ఛాన్స్ ఉంది.
- Advertisement -