Saturday, December 21, 2024

టీ20 ప్రపంచ క‌ప్: రికార్డు సృష్టించిన రోహిత్ శర్మ

- Advertisement -
- Advertisement -

టీ20 ప్రపంచ క‌ప్ లో భాగంగా జరిగిన తన తొలి మ్యాచ్‌లోనే ఐర్లాండ్ జట్టుపై టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో అర్థశతకం(52)తో రాణించాడు కెప్టెన్ రోహిత్. ఈక్రమంలో హిట్ మ్యాన్ అరుదైన రికార్డు సాధించాడు. అంతర్జాతీయ టీ20ల్లో 4000 పరుగులు పూర్తి చేసుకున్న మూడో బ్యాటర్‌గా చరిత్ర సృష్టించారు. దాంతోపాటు తక్కువ బంతుల్లో 4వేల పరుగులు చేసిన తొలి బ్యాట్స్ మెన్ గాను రోహిత్ రికార్డు నెలకొల్పాడు. రోహిత్ శర్మ కంటే ముందు తొలి రెండు స్థానాల్లో విరాట్ కోహ్లీ(4,038), పాకిస్తాన్ కెప్టెన్ బాబ‌ర్(4,023)లు ఉన్నారు.

కాగా, నిన్న ఐర్లాండ్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో రోహిత్ తోపాటు వికెట్ కీప‌ర్ రిష‌భ్ పంత్(36 నాటౌట్) రాణించాడు.దీంతో 8 వికెట్ల తేడాతో భారత్ గెలుపొందింది. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ 16 ఓవర్లలో 96 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్లలో పాండ్య మూడు వికెట్లు పడగొట్టగా.. అర్షదీప్, బుమ్రాలు చెరో రెండు వికెట్లు తీశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News