Wednesday, January 22, 2025

కోహ్లితో పోల్చితే రోహిత్ మెరుగైన కెప్టెన్: మంజ్రేకర్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: వన్డే ఫార్మాట్ కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లిని తప్పిస్తూ భారత క్రికెట్ బోర్డు(బిసిసిఐ) తీసుకున్న నిర్ణయాన్ని మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ సమర్థించాడు. జట్టును ప్రధాన టోర్నీల్లో గెలిపించలేని కెప్టెన్ ఎన్నీ రికార్డులు సాధించినా ఫలితం ఉండదన్నాడు. జట్టుకు కావాల్సింది ట్రోఫీలే కానీ రికార్డులు కావని అభిప్రాయపడ్డాడు. విరాట్ కోహ్లితో పోల్చితే రోహిత్ మెరుగైన కెప్టెన్ అనడంలో ఎలాంటి సందేహం లేదన్నాడు. అతని సారథ్యంలో టీమిండియా మంచి ఫలితాలు సాధించడం ఖాయమని మంజ్రేకర్ పేర్కొన్నాడు. కాగా, గాయం కారణంగా సౌతాఫ్రికా పర్యటనకు దూరమైన రోహిత్ వచ్చే నెలల స్వదేశంలో వెస్టీండీస్ జట్టుతో జరగనున్న వన్డే, టీ20 సిరీస్ లకు అందుబాటులోకి రానున్నాడు.

Rohit Sharma better Captain than Kohli: Manjrekar

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News