Monday, January 13, 2025

ఓపెనింగ్ పై రోహిత్ శర్మ క్లారిటీ..

- Advertisement -
- Advertisement -

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా గురువారం నుంచి భారత్-ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్టు మ్యాచ్ జరగనుంది. అడిలైడ్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ లో టీమిండియా ఓపెనింగ్ జోడీపై కెప్టెన్ రోహిత్ శర్మ క్లారిటీ ఇచ్చాడు. రెండో టెస్టులో కేఎల్ రాహుల్, యశస్వీ జైస్వాల్ ఓపెనింగ్ చేస్తారని రోహిత్ వెల్లడించారు.

తొలి టెస్టులో జైస్వాల్‌తో కలిసి రాహుల్ నెలకొల్పిన భాగస్వామ్యం విజయంలో కీలక పాత్ర పోషించిందన్నారు. విదేశాల్లో బ్యాటింగ్ చేసిన విధానం వల్ల అతను ఓపెనింగ్‌కు అర్హుడని చెప్పారు. తాను మధ్యలో ఎక్కడో చోట బ్యాటింగ్ చేస్తానని ప్రకటించారు. ఈ నిర్ణయం వ్యక్తిగతంగా తనకు కష్టమైనా జట్టుకు మంచి చేస్తుందని రోహిత్ చెప్పాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News