Monday, December 23, 2024

విరాట్ ఫామ్‌పై చర్చ వద్దు

- Advertisement -
- Advertisement -

Rohit Sharma defends Virat Kohli

 

లండన్ : స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి ఫామ్ గురించి విపరీత చర్చ జరగడంపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. కోహ్లి ఫామ్ గురించి ఎందుకింత చర్చ నడుస్తుందో తనకు అంతుబట్టడం లేదన్నాడు. ఫామ్‌ను అడ్డం పెట్టుకుని విరాట్‌లాంటి దిగ్గజ క్రికెటర్‌పై విమర్శలు గుప్పించడం ఏమాత్రం సమంజసం కాదన్నాడు. అతను చాలా ఏళ్ల నుంచి టీమిండియా తరఫున ఆడుతున్నాడు. ఈ క్రమంలో ఎన్నో మ్యాచుల్లో జట్టుకు ఒంటిచేత్తో విజయాలు సాధించి పెట్టాడు. అంతేగాక మూడు ఫార్మాట్‌లలోనూ అగ్రశ్రేణి బ్యాటర్‌గా పేరు తెచ్చుకున్నాడు. అలాంటి క్రికెటర్‌పై కొంత మంది పనిగట్టుకుని విమర్శలు గుప్పించడంపై రోహిత్ అసహనం వ్యక్తం చేశాడు. కోహ్లి మళ్లీ ఫామ్‌ను అందుకోవడం ఖాయమన్నాడు. తనపై వస్తున్న విమర్శలకు బ్యాట్‌తోనే సమాధానం చెప్పే సత్తా కోహ్లికి ఉందన్నాడు. కాగా ఎంతటి పెద్ద బ్యాట్స్‌మన్‌కైనా కెరీర్‌లో ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులు తప్పవన్నాడు. అంత మాత్రాన అతని ప్రతిభను తక్కువ చేసి విమర్శలు చేయడం సముచితం కాదన్నాడు. ప్రస్తుతం కోహ్లి ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్న విషయంలో ఎలాంటి సందేహం లేదన్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News