Sunday, December 22, 2024

అందుకే ఆ మట్టిని తిన్నాను: రోహిత్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: టి20 వరల్డ్ కప్ టీమిండియా గెలిచిన తరువాత క్రికెట్ అభిమానుల ఆనంధానికి అవధులు లేకుండాపోయాయి. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, హార్ధిక్ పాండ్యా భావోద్వేగానికి లోనయ్యారు. రోహిత్ వరల్డ్ కప్ సాధించాలనే కలను నేరవేర్చుకున్నారు. వరల్డ్ కప్ గెలిచిన రోజు రాత్రి నిద్రపోకుండా టీమిండియా జట్టు సంబరాలు చేసుకుంది. ఫైనల్ మ్యాచ్ గెలిచిన తరువాత రోహిత్ శర్మ పిచ్‌లోని మట్టి తీసుకొని తిన్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మట్టి ఎందుకు తిన్నాను అనేదానిపై వివరణ ఇచ్చాడు.

బార్బడోస్ పిచ్‌పై టి20 వరల్డ్ కప్ గెలిచామని, ఈ పిచ్ తనకు ఎంతో ప్రత్యేకమైందని, పిచ్‌ను జీవితాంతం గుర్తు చేసుకుంటానని, పిచ్‌ను తనలో భాగం చేసుకునేందుకు పిచ్‌పై ఉన్న మట్టిని నోట్లో వేసుకున్నానని రోహిత్ చెప్పారు. టి20 వరల్డ్ కప్ సాధించామనే ఫీలింగ్ నమ్మశక్యంగా లేదని, ఫైనల్ మ్యాచ్ ముగిసినప్పటి నుంచి ఇప్పటివరకు ఒక కలలా ఉందని పేర్కొన్నారు. ఈ విజయాన్ని పూర్తి ఆస్వాదించానని రోహిత్ తెలియజేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News