Wednesday, January 22, 2025

ప్రపంచకప్‌లో సిక్సర్ల మోత.. రోహిత్ శర్మ రికార్డు

- Advertisement -
- Advertisement -

భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ మరో రికార్డు అందుకున్నాడు. ముంబై వాంఖడే స్టేడియంలో న్యూజిలాండ్ జట్టుతో జరుగుతున్న ప్రపంచకప్ సెమీ ఫైనల్ మ్యాచ్ లో అత్యధిక సిక్సర్లు రికార్డును రోహిత్ శర్మ సమం చేశాడు. క్రిస్ గేల్ పేరిట ఉన్న 49 సిక్సర్లు రికార్డును రోహిత్ అందుకున్నాడు.

సెమీ ఫైనల్ మ్యాచ్ లో భారత్ తొలి వికెట్ కోల్పోయింది. రోహిత్ శర్మ(47) క్యాచ్ ఔట్ అయ్యాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ కు ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్ మన్ గిల్ లు శుభారంభం అందించారు. ప్రస్తుతం భారత్ 11 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 89పరుగులు చేసింది. క్రీజులో విరాట్ కోహ్లీ(4), గిల్(35)లు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News