Saturday, December 21, 2024

రోహిత్‌ను తప్పించడంపై ముంబై అభిమానుల ఆగ్రహం..

- Advertisement -
- Advertisement -

ముంబై: రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పిస్తూ ముంబై ఇండియన్స్ యాజమాన్యం తీసుకున్న నిర్ణయాన్ని హిట్‌మ్యాన్ అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు. తమ అభిమాన ఆటగాడు రోహిత్‌ను ఉన్న ఫలంగా సారథ్య బాధ్యతల నుంచి తప్పించి హార్దిక్ పాండ్యను కెప్టెన్‌గా నియమించడంపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ముంబై ఇండియన్స్‌ను ఐదుసార్లు ఐపిఎల్ ఛాంపియన్‌గా నిలిపిన రోహిత్‌ను ఇలా అవమానించడాన్ని అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. ఐపిఎల్‌లోనే అభిమానుల పరంగా ముంబై ఇండియన్స్ అగ్రస్థానంలో ఉన్న విషయం తెలిసిందే. రోహిత్ శర్మ అద్భుత సారథ్యం వల్లే అభిమానులు ముంబైకి నీరాజనం పడుతూ వస్తున్నారు.

అయితే ముంబై ఇండియన్స్ యాజమాన్యం రోహిత్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించడంతో వారు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఇప్పటికే ఇన్‌స్టా, ట్విటర్ తదితర సోషల్ వేదికల నుంచి దాదాపు 8 లక్షల మంది ఫాలోవర్స్ తప్పుకున్నారు. ఇది ముంబై ఇండియన్స్‌కు అతి పెద్ద షాక్‌గా చెప్పాలి. హార్దిక్ కెప్టెన్సీలో రోహిత్ ఆడడాన్ని వారు ఊహించలేక పోతున్నారు. ఏళ్ల తరబడి ముంబై ఇండియన్స్ అన్నీ తానై నడిపించిన రోహిత్‌ను ఇలా అవమానిస్తారని ఎవరూ ఊహించలేదు. ఇక రోహిత్ అభిమానులకైతే ఇది చాలా ఆగ్రహం తెప్పించిందనే చెప్పాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News