Wednesday, January 22, 2025

నా భుజాలపై అతడు చేతులేసి నడిపిస్తాడు: పాండ్యా

- Advertisement -
- Advertisement -

ముంబై: ఐపిఎల్‌లో పటిష్టమైన ముంబై ఇండియన్స్ టీమ్‌కు సారథ్యం వహించే అవకాశం రావడం అత్యంత అరుదైన గౌరవంగా భావిస్తున్నట్టు హార్దిక్ పాండ్య పేర్కొన్నాడు. ఈ సీజన్‌లో ముంబై కెప్టెన్‌గా హార్దిక్‌ను నియమించిన విషయం తెలిసిందే. త్వరలో ఐపిఎల్ సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో హార్దిక్ పాండ్య సోమవారం మీడియా సమావేశంలో మాట్లాడాడు. ఈ క్రమంలో పలు విషయాలను వెల్లడించాడు. ముంబై వంటి అగ్రశ్రేణి జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనుండడం కొత్త అనుభూతిని ఇస్తుందన్నాడు.

దీని కోసం తాను ఎంతో అతృతతో ఎదురు చూస్తున్నట్టు పేర్కొన్నాడు. కెప్టెన్‌గా ఎంపిక కావడంతో తన బాధ్యత మరింత పెరిగిందన్నాడు. జట్టును ముందుండి నడిపించాల్సిన బాధ్యత తనపై ఉందన్నాడు. రోహిత్ శర్మ వంటి సీనియర్ ఆటగాడు జట్టులో ఉండడం తనకు ఎంతో ఊరటనిచ్చే అంశమన్నాడు. అతని సలహాలు, సూచనలు తనకు కలిసి వస్తాయన్నాడు. తన కెప్టెన్సీలో ఆడేందుకు రోహిత్‌కు ఎలాంటి ఇబ్బంది ఉండక పోవచ్చన్నాడు. తన భుజాలపై చేతులేసి తనతో జట్టును రోహిత్ నడిపిస్తాడని ప్రశంసించారు. తొలి ఫేజ్‌లో జట్టుకు సాధ్యమైనన్నీ విజయాలు సాధించి పెట్టడమే లక్షంగా ముందుకు సాగుతున్నట్టు హార్దిక్ పేర్కొన్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News