Friday, February 28, 2025

న్యూజిలాండ్‌ తో మ్యాచ్‌… భారత్‌కు షాక్

- Advertisement -
- Advertisement -

దుబాయ్: ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీలో టీం ఇండియా వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఈ టోర్నమెంట్‌లో ఇప్పటికే బంగ్లాదేశ్, పాకిస్థాన్‌లను మట్టికరిపించి సెమీస్‌కు చేరింది. అయితే లీగ్ దశలో భారత్‌ చివరి మ్యాచ్‌ న్యూజిలాండ్‌తో ఆడనుంది. అయితే ఈ మ్యాచ్‌కి ముందు భారత్‌కు షాక్ తగిలింది. గాయం కారణంగా కెప్టెన్‌ రోహిత్ శర్మ ఈ మ్యాచ్‌కి దూరం అవుతాడని వార్తలు వినిపిస్తున్నాయి.

పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ పిక్కల నొప్పితో బాధపడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మైదానం వీడి కాసేపు విశ్రాంతి తీసుకున్న ఆ తర్వాత మళ్లీ ఫీల్డింగ్‌కు వచ్చాడు. అయితే ఈ నొప్పి ఇంకా పూర్తిగా తగ్గకపోవడంతో రోహిత్ ప్రాక్టీస్‌ సెషన్స్‌లో బ్యాటింగ్ చేయలేకయాడు. దీంతో రోహిత్ కివీస్‌తో జరిగే మ్యాచ్‌కి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అయితే కివీస్‌తో జరిగే రోహిత్ ఈ మ్యాచ్‌కి దూరమైతే.. అతని స్థానంలో ఓపెనర్‌గా కెఎల్ రాహుల్‌ని కెప్టెన్సీ బాధ్యతలను వైస్‌ కెప్టెన్ అయినా.. శుభ్‌మాన్ గిల్‌కు అప్పగించే అవకాశం ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News