ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజనలో ముంబై ఇండియన్స్.. ఆరంభంలో తడబడినా ఇప్పుడు పుంజుకుంది. వరుస మ్యాచుల్లో విజయం సాధిస్తూ.. ప్లేఆఫ్‌కు దూసుకువెళ్లేందుకు ప్రయత్నం చేస్తోంది. ఈ సీజన్‌లో ఆరంభంలో విఫలమైన జట్టు స్టార్ ఆటగాడు రోహిత్ శర్మ కూడా ఇప్పుడు ఫామ్‌లోకి వచ్చాడు. ఐపిఎల్‌లో ఇప్పటికే రోహిత్ పేరిట ఎన్నో రికార్డులు ఉన్నాయి. కాగా, రోహిత్ మరో రికార్డు ముంగిట రోహిత్ నిలిచాడు. ఆదివారం మధ్యాహ్నం ముంబై ఇండియన్స్ జట్టు లక్నోతో తలపడుతోంది.
ఈ మ్యాచ్‌లో రోహిత్ కానీ 5 సిక్సులు కొడితే.. ఐపిఎల్‌లో 300 సిక్సులు కొట్టిన భారత ఆటగాడిగా రికార్డు సృష్టిస్తాడు. ఇప్పటివరకూ ఐపిఎల్‌లో 265 మ్యాచులు ఆడిన అతను.. 295 సిక్సులు కొట్టాడు. ఇప్పటివరకూ 300 సిక్సులు బాదిన ఆటగాడిగా క్రిస్ గేల్ నిలిచాడు. గేల్ 142 మ్యాచుల్లో 357 సిక్సులు బాదాడు. ఇప్పుడు రోహిత్ 5 సిక్సులు కొడితే.. 300 సిక్సుల మైలురాయిని దాటే అవకాశం ఉంది. ఇక బెంగళూరు స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ.. రోహిత్ తర్వాతి స్థానంలో ఉన్నాడు. 261 మ్యాచులు ఆడిన కోహ్లీ 285 సిక్సులు కొట్టాడు.