Wednesday, December 25, 2024

రిటైర్మెంట్ ఆలోచన లేదు: రోహిత్ శర్మ

- Advertisement -
- Advertisement -

ఫ్లోరిడా: అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించే ఆలోచన తనకు లేదని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్పష్టం చేశాడు. అమెరికా వేదికగా జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న రోహిత్ శర్మ ఈ విషయాన్ని వెల్లడించాడు. మరికొన్నేళ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్‌లో కొనసాగుతానని పేర్కొన్నాడు. వచ్చే ఏడాది వెస్టిండీస్, అమెరికా వేదికగా జరిగే టి20 ప్రపంచ కప్‌లో తాను పాల్గొంటానని తెలిపాడు.

ప్రస్తుతం తాను పూర్తి ఫిట్‌నెస్‌తో ఉన్నానని, మరికొంత కాలం పాటు క్రికెట్ ఆడే సత్తా తనకుందన్నాడు. యువ క్రికెటర్లకు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతోనే తాను పరిమిత ఓవర్ల క్రికెట్‌కు దూరంగా ఉంటున్నానని, అయితే వరల్డ్‌కప్ వంటి మెగా టోర్నీలలో జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తానని వివరించాడు. ఇక రానున్న వన్డే ప్రపంచకప్ తమకు చాలా కీలకమన్నాడు. సుదీర్ఘ కాలంగా ఐసిసి టోర్నీల్లో తాము ట్రోఫీలు సాధించలేక పోతున్నామన్నాడు.

అయితే సొంత గడ్డపై జరుగుతున్న వన్డే వరల్డ్‌కప్‌లో ఈసారి ట్రోఫీ సాధించాలనే పట్టుదలతో ఉన్నామన్నాడు. సీనియర్, యువ ఆటగాళ్లతో కూడిన తమకు ప్రపంచకప్ గెలిచి అవకాశాలు అధికంగా ఉన్నాయన్నాడు. సమష్టిగా రాణిస్తే ట్రోఫీ గెలవడం అసాధ్యమేమీ కాదని రోహిత్ అభిప్రాయపడ్డాడు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News