Friday, January 24, 2025

తీరు మారని రోహిత్…. రంజీలోనూ విఫలం

- Advertisement -
- Advertisement -

ముంబై: టెస్టుల్లో వరుస వైఫల్యాలు చవిచూస్తున్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రంజీ ట్రోఫీలోనూ అదే సంప్రదాయాన్ని కొనసాగించాడు. జమ్మూ కాశ్మీర్‌తో జరుగుతున్న రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూప్‌ఎ మ్యాచ్‌లో రోహిత్ శర్మ 3 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. యశస్వి జైస్వాల్‌తో కలిసి రోహిత్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించాడు. అయితే రోహిత్ మాత్రం బ్యాట్‌ను ఝులిపించడంలో విఫలమయ్యాడు. సింగిల్ డిజిట్ స్కోరుకే వెనుదిరిగాడు. యశస్వి (4) కూడా నిరాశ పరిచాడు. వన్‌డౌన్‌లో వచ్చిన హార్దిక్ తామోర్ (7) కూడా రెండంకెల స్కోరును అందుకోలేక పోయాడు. కెప్టెన్ అజింక్య రహానె (12), శ్రేయస్ అయ్యర్ (11), శివమ్ దూబె (0), షమ్స్ ములాని (0) ఘోరంగా విఫలమయ్యారు.

కానీ శార్దూల్ ఠాకూర్ మాత్రం అద్భుత బ్యాటింగ్‌తో అలరించాడు. అతనికి తనుష్ కొటియన్ అండగా నిలిచాడు. ప్రత్యర్థి జట్టు బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న శార్దూల్ 5 ఫోర్లు, రెండు సిక్సర్లతో 51 పరుగులు చేశాడు. తనుష్ ఐదు ఫోర్లతో 26 పరుగులు సాధించాడు. ఇతర బ్యాటర్లు విఫలం కావడంతో ముంబై తొలి ఇన్నింగ్స్ 33.2 ఓవర్లలో 120 పరుగుల వద్ద ముగిసింది. జమ్మూ బౌలర్లలో ఉమర్ నజీర్, యుద్విర్ సింగ్ నాలుగేసి వికెట్లను పడగొట్టారు. అఖిబ్ నబికి రెండు వికెట్లు దక్కాయి. తర్వాత తొలి ఇన్నింగ్స్ చేపట్టిన జమ్మూ టీమ్ శనివారం మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 7 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. ఓపెనర్ శుభం ఖజురియా (53), అబిద్ ముస్తాక్ (44) మెరుగైన బ్యాటింగ్‌ను కనబరిచారు. జమ్మూకు ఇప్పటి వరకు 54 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News