Monday, April 21, 2025

ధోనీతో అంత ఈజీ కాదు.. ప్రశంసలు కురిపించిన రోహిత్

- Advertisement -
- Advertisement -

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర ధోనీపై హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ప్రశంసలు కురిపించారు. ధోనీ పరిస్థితులను తలకిందులు చేయగల సమర్థుడు అని అన్నారు. ఓ ఇంటర్వ్యూలో ధోని గురించి మాట్లాడుతూ.. ఆయనతో అంత ఈజీ కాదని.. క్రికెట్ లో ఆయన సామర్థ్యం, అనుభవాన్ని రోహిత్ కొనియాడారు.  “మహీ ఎన్నో మ్యాచులకు కెప్టెన్‌గా చేశారు. ఎన్నో ట్రోఫీస్ గెలిపించారు. అలాంటి వ్యక్తి ప్రత్యర్థిగా ఉంటే మనం రిలాక్స్ అవ్వకూడదు. మనం ఆధిక్యంలో ఉన్నా.. ఒక సడెన్ మూవ్‌తో మనల్ని ప్రెజర్‌లోకి నెట్టగలడు. ధోనీ ఉంటే.. బ్యాటింగ్ అయినా, ఫీల్డింగ్ అయినా కచ్చితంగా అప్రమత్తంగా ఉండాలి” అని రోహిత్ పేర్కొన్నాడు.

కాగా, రోహిత్ , ధోనీ కెప్టెన్సీలలో.. ముంబై, చెన్నై జట్లు ఐదుసార్లు ఐపిఎల్ లో విజేతగా నిలిచాయి. ఇప్పుడు వీరిద్దరూ జట్టుల్లో ప్లేయర్స్ గా మాత్రమే ఉన్నారు. ఆదివారం రాత్రి వాంఖడే స్టేడియం వేదికగా ఇరుజట్లు తలపడబోతున్నాయి. ఈ మ్యాచ్ లో గెలిస్తేనే చెన్నైకి ప్లేఆఫ్ అవకాశాలు సజీవంగా ఉంటాయి. మరోవైపు, పాయింట్ల పట్టకలో ఏడో స్థానంలో ఉన్న ముంబై.. ఈ మ్యాచ్ లో గెలిచి సత్తా చాటాలని భావిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News