Sunday, December 22, 2024

టెస్టుల్లో ధోని రికార్డు బద్దలుకొట్టనున్న రోహిత్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: భారత్-ఇంగ్లాండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ జరుగుతోంది. తొలి టెస్టు జనవరి 25 నుంచి హైదరాబాద్ వేదికగా ప్రారంభమవుతోంది. ఈ మ్యాచ్‌లో ధోని రికార్డును కెప్టెన్ రోహిత్ శర్మ బద్ధలుకొట్టనున్నాడు. టెస్టుల్లో రోహిత్ (77) ఒక సిక్స్ కొడితే ధోని78 సిక్స్‌లను రికార్డును సమం చేయనున్నాడు. మరో 14 సిక్స్‌లు బాదితే సెహ్వాగ్ రికార్డును కూడా బద్ధలు కొడుతారు. ఈ టెస్టు సిరీస్ అయ్యే లోపు సెహ్వాగ్ (91) రికార్డు బద్దలు కావడం ఖాయమని క్రికెట్ పండితులు చెబుతున్నారు. అందుల్లో భారత్ పిచ్‌లపై టెస్టు మ్యాచ్‌లు జరుగుతుండడంతో రోహిత్ శర్మ నీళ్లు తాగినట్టుగా అలవొకగా సిక్స్‌లు బాదుతాడు. 124 సిక్స్ లతో బెన్ స్టోక్స్ తొలి స్థానంలో ఉండగా రెండో స్థానంలో మెకకలమ్(107), వరసగా గిల్ క్రిస్ట్(100), గేల్(98), జాక్వస్ హలిస్(97), సెహ్వాగ్ లు (91) ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News