హిట్ మ్యాన్ రోహిత్ శర్మ హైదరాబాద్ కు చేరుకున్నాడు. సోమవారం తన భార్య, కూతరుతోపాటు ముంబై ప్లేయర్లతో శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నాడు. మార్చి 27(బుధవారం)న ఉప్పల్ వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ తో ముంబై ఇండియన్స్ తలపడనుంది. ఈ క్రమంలో టీమ్ సభ్యులతో కలిసి హైదరాబాద్ కు వచ్చాడు రోహిత్. రేపు ఇరుజట్లు మధ్య మ్యాచ్ రసవత్తరంగా జరగనుంది.
రెండు జట్టు ఆడిన తొలి మ్యాచ్ ల్లో ఓడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మెగా టోర్నీలో బోణి కొట్టేందుకు ఇరుజట్లు సిద్దమయ్యాయి. సొంత గడ్డపై తొలి మ్యాచ్ ఆడుతున్న సన్ రైజర్స్ ముంబైని ఓడించడం అంత సులువేం కాదు. ఎందుకంటే.. ముంబై అంటేనే బ్యాటింగ్ పెట్టింది పేరు. అయితే, తమ ప్రధాన బలమైన బౌలింగ్ తో మంబైని దెబ్బ కొట్టాలని ఆరేంజ్ ఆర్మీ భావిస్తోంది.
Goat Rohit Sharma has arrived in Hyderabad.pic.twitter.com/nHYYGtDJhJ
— 𝐂𝐡𝐚𝐢𝐭𝐡𝐮 🇮🇳 (@ChaitRo45) March 25, 2024