- Advertisement -
హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఓపెనర్‌గా రికార్డు సృష్టించాడు. అంతర్జాతీయ క్రికెట్ ఓపెనర్‌గా రోహిత్ 13000 పరుగుల మైలురాయి అందుకున్నాడు. డబ్ల్యుటిసి ఫైనల్ మ్యాచ్‌లో 12 పరుగుల వద్ద ఈ ఘనత సాధించాడు. రోహిత్ శర్మ 295 మ్యాచ్‌లో ఓపెనర్‌గా ఆడి 13031 పరుగులు చేశాడు. రోహిత్ ఓపెనర్‌గా 35 శతకాలు, 63 అర్ధ శతకాలు సాధించాడు. భారత్ క్రికెట్ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ 15758 పరుగులు చేయగా క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ 15335 పరుగులు చేశాడు. డబ్లుటిసి ఫైనల్‌లో చివరి రోజు భారత జట్టు 280 పరుగులు చేస్తే విజయం సాధించినట్టే, ఆసీస్ ఏడు వికెట్లు తీసిన ఆ జట్టు ఖాతాలోకి విజయం వెళ్లిపోతుంది.
Also Read: బాలకృష్ణతో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సినిమా ప్రారంభం
- Advertisement -