ముంబై: దక్షిణాఫ్రికాతో జరిగే సిరీస్ కోసం టీమిండియాను భారత క్రికెట్ బోర్డు బుధవారం ప్రకటించింది. సౌతాఫ్రికా సిరీస్‌లో భారత్ మూడు టెస్టు మ్యాచ్‌లు ఆడనుంది. టెస్టుల కోసం 18 మందితో కూడిన జట్టును ఎంపిక చేశారు. ఇక సిరీస్‌లో రోహిత్ శర్మను వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేశారు. ఇంతకుముందు అజింక్య రహానె టెస్టు జట్టుకు వైస్ కెప్టెన్ వ్యవహరించిన విషయం తెలిసిందే. ఇక ఊహించినట్టే సీనియర్లు రహానె, పుజారాలకు మరో అవకాశం కల్పించింది. కొంతకాలంగా వీరిద్దరూ వరుస వైఫల్యాలు చవిచూస్తున్న విషయం తెలిసిందే. ఇక శార్దూల్ ఠాకూర్, హనుమ విహారి, జయంత్ యాదవ్, కెఎల్.రాహుల్, మయాంక్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ తదితరులు జట్టులోకి వచ్చారు. గాయం కారణంగా రవీంద్ర జడేజాను ఎంపిక చేయలేదు. సైని, సౌరభ్ కుమార్, దీపక్ చాహర్, అర్జాస్‌లను స్టాండ్‌బైలుగా ఎంపిక చేశారు.
వన్డే కెప్టెన్‌గా హిట్‌మ్యాన్
మరోవైపు వన్డే కెప్టెన్‌గా రోహిత్ శర్మను బిసిసిఐ నియమించింది. ఇప్పటికే రోహిత్ టి20 ఫార్మాట్‌కు కూడా కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా వన్డే ఫార్మాట్‌లకు కూడా రోహిత్ పూర్తి స్థాయి కెప్టెన్‌గా ఎంపిక చేశారు. ఇక విరాట్ కేవలం టెస్టులకు మాత్రమే కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు.
జట్టు వివరాలు:
విరాట్ కోహ్లి (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), రహానె, రాహుల్, పుజార, అయ్యర్, విహారి, రిషబ్, సాహా, అశ్విన్, జయంత్, ఇషాంత్, సిరాజ్, ఉమేశ్, శార్దూల్, షమీ.
Rohit Sharma Replace Kohli as ODI Captain