Wednesday, January 22, 2025

నేను ఎవరినీ కలువలేదు… అది ఫేక్ న్యూస్: రోహిత్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: టి20 వరల్డ్ కప్ కోసం భారత జట్టులోకి ఎవరిని తీసుకుంటారు? ఎవరిని పక్కకు పెడుతారు? అనేది సస్ఫెన్షన్ నెలకొంది. యువ క్రికెటర్ల ఎంపిక అనేది సీనియర్ల తీవ్రమైన పోటీ నెలకొనడంతో ఎవరిని ఎంపిక చేస్తారనేది ఉత్కంఠ నెలకొంది. భారత జట్టు ఎంపికపై బిసిసిఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ తో భారత కెప్టెన్ రోహిత్ శర్మ సమావేశామయ్యాడని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించారు. జట్టు ఎంపిక కోసం తాను ఎవరినీ కలువలేదని, అదంతా ఫేక్ న్యూస్ అని తెలిపాడు. అజిత్ అగార్కర్ దుబాయ్ లో ఉన్నాడని, అక్కడ గోల్ఫ్ ఆడుతున్నాడని, రాహుల్ ద్రావిడ్ తన కుటుంబ సభ్యులతో ముంబయిలో సరదాగా గడుపుతున్నాడని, మేము ముగ్గురం ఎక్కడా కలుసుకోలేదని రోహిత్ వివరణ ఇచ్చాడు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు నిజాలు కావని, వరల్డ్ కప్ కోసం మాజీ కెప్టెన్ ధోనీని మెంటర్ గా ఒప్పించడం కష్టమేనని, ఇప్పటికే ఆయన మోకాలి నొప్పితో బాధపడుతున్నాడని, వెస్టిండీస్ కు వచ్చేది కష్టమేనని, ఐపిఎల్ లో ఆడటంతో ధోనీ అలసి పోయి ఉన్నాడని, ముంబయిపై అతడు నాలుగు బంతుల్లోనే 20 పరుగులు చేయడంతో చెన్నై జట్టు గెలిచిందని తెలిపాడు. టి20 వరల్డ్ కప్ 2021కు ధోనీ మెంటర్ గా సేవలందించిన విషయం తెలిసిందే. ఇవాళ పంజాబ్ జట్టు తో ముంబయి జట్టు ఆడనుంది.

ప్రస్తుతం భారత్ జట్టును ఎంపిక చేయడమే కష్టంగా మారింది. రోహిత్ కు ఓపెనర్ గా గిల్ లేదా జైశ్వాల్ ఎంపిక చేస్తారు. విరాట్ కోహ్లీ ఫస్ట్ డౌన్ లేదా సెకండ్ డౌన్ లో బ్యాటింగ్ చేస్తాడు. శివమ్ దూబేను కూడా ఎంపిక చేసే అవకాశం ఉంది. ఆ తరువాత సూర్య కుమార్, రింకూ సింగ్, రవీంద్ర జడేజా, హార్ధిక్ పాండ్యా బ్యాటింగ్ చేస్తారు. బౌలింగ్ విభాగంలో బుమ్రా, కులదీప్ యాదవ్ తీసుకుంటారు. కీపర్ కు తీవ్రమైన పోటీ నెలకొంది. రిషభ్ పంత్ ను జట్టులోకి తీసుకుంటే కెఎల్ రాహుల్, సంజూ శాంసన్ బెంచ్ కే పరిమితమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News