- Advertisement -
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డును తన ఖాతాలోవేసుకున్నాడు. మంగళవారం ఆస్ట్రేలియాతో జరిగిన ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ సెమీ ఫైనల్లో రోహిత్ ఈ ఫీట్‌ను సాధించాడు. ఈ క్రమంలో ఐసిసి వన్డే టోర్నీల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాటర్‌గా సరికొత్త ప్రపంచ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఆస్ట్రేలియా బౌలర్ నాథన్‌ఎల్లిస్ వేసిన ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లో రెండో బంతిని రోహిత్ సిక్సర్‌గా మలిచాడు. దీంతో రోహిత్ ఖాతాలో అరుదైన రికార్డు చేరింది. ఈ సందర్భంగా ఐసిసి టోర్నీల్లో అత్యధిక సిక్సర్లు బాదిన క్రికెటర్‌గా రోహిత్ ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఈ క్రమంలో క్రిస్ గేల్ (విండీస్) పేరిట ఉన్న 64 సిక్స్‌ల రికార్డును రోహిత్ బద్దలు కొట్టాడు.
- Advertisement -