Sunday, January 19, 2025

ధోనీ, యువీ కంటే అతడే సిక్స్ లు బాగా బాదగలడు: రాహుల్ ద్రావిడ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కెప్టెన్ రోహిత్ శర్మపై టీమిండియా కోచ్ రాహుల్ ద్రావిడ్ ప్రశంసల జల్లు కురిపించాడు. రోహిత్ వంటి హిట్టర్ టీమిండియాలో లేడు అని, సిక్సర్లు బాదడంలో అతడికి అతడే సాటి అని మెచ్చుకున్నాడు. రోహిత్ శర్మ 2007లో టీమిండియాలో స్థానం లభించడంతో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. రోహిత్ శర్మ మొదట్లో మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేసేవాడు. ధోనీ కెప్టెన్ అయిన తరువాత రోహిత్‌ను ఓపెనర్‌గా పంపించాడు. వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలు చేసి రికార్డు సృష్టించాడు. వన్డేలలో 31, టెస్టుల్లో 12 , టి20లలో 5 సెంచరీలు చేశాడు. మూడు ఫార్మట్లలో కలిసి ఇప్పటి వరకు రోహిత్ 597 సిక్స్‌లతో తొలి స్థానంలో ఉన్నాడు.

ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టులో సిరీస్‌లో రెండు సెంచరీలు చేయడంతో 4-1 భారత జట్టు తేడాతో సిరీస్‌ను గెలుచుకుంది. ఈ సందర్భంగా రాహుల్ ద్రావిడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా ఆటగాళ్లకు తన వీడియోలు చూపించానని, అందుకే సిక్సర్ల మీద సిక్సర్లు బాదుతున్నారని నవ్వుతూ చెప్పారు.. ఏ ఫార్మట్‌లోనైనా సిక్స్‌లు కొడుతుంటే ఆనందానికి అవధులు ఉండవని చెప్పారు. భారత జట్టులో రోహిత్‌లాంటి సిక్స్‌ల హిట్టర్ ఉండడం గొప్ప అని, షాట్ బాదడంలో పవర్, నైపుణ్యం అద్భుతంగా ఉంటుందని ప్రశంసించారు. రోహిత్‌లాగా సిక్సర్లు బాదిన ఆటగాడు టీమిండియాలో లేడని జియో సినిమా షోలో ద్రావిడ్ ముచ్చటించాడు. మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ కూడా టీమిండియాలో గొప్ప సిక్స్ హిట్టర్లుగా పేరు తెచ్చుకున్న విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News