చెన్నై: చెపాక్ వేదికగా జరుగుతున్న ఇంగ్లాండ్- భారత్ రెండో టెస్టు మ్యాచ్ లో రోహిత్ శర్మ సెంచరీ కొట్టాడు. 130 బంతుల్లో వన్డే తరహాలో బ్యాటింగ్ చేసి టెస్ట్ కెరీర్లో 7వ శతకం పూర్తి చేశాడు. తొలి మ్యాచ్లో ఘోరంగా విఫలమైన ఓపెనర్ రోహిత్ ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్స్, స్పిన్నర్స్ను రోహిత్ ఉతికి ఆరేశాడు. పుజరా (21)తో 85 పరుగుల భాగస్వామ్యం నమోదు చేయగా, వైస్ కెప్టెన్ అజింక్యా రహానే(25)తో 58 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని అందించాడు. ఈ క్రమంలో భారత్ రెండో సెషన్లో మూడు వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. రెండో టెస్ట్ మ్యాచ్లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కాగా, రోహిత్ శర్మతో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఓపెనర్ శుభమన్ గిల్ రెండో ఓవర్లోనే ఎల్బీగా పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన చతేశ్వర్ పుజారా వికెట్ ను స్పిన్నర్ జాక్ లీచ్ తీశాడు. ఇక టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ (0:5 బంతుల్లో) ఊహించని రీతిలో మొయిన్ అలీ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
Applause from the Chepauk crowd 👌
Dressing room on its feet 👏
A congratulatory hug from Ajinkya Rahane 👍Appreciation from all round for @ImRo45 as he completes a fine hundred in tough conditions. 🙌🙌 @Paytm #INDvENG #TeamIndia
Follow the match 👉 https://t.co/Hr7Zk2kjNC pic.twitter.com/nWmQfH5Xem
— BCCI (@BCCI) February 13, 2021
Rohit Sharma smashes 7th Test century