Monday, December 23, 2024

మూడు ఫార్మాట్‌లలో నేనే కెప్టెన్: రోహిత్

- Advertisement -
- Advertisement -

టి20 కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలనే ఆలోచన తనకు లేదని టీమిండియా సారథి రోహిత్ శర్మ స్పష్టం చేశాడు. పొట్టి ఫార్మాట్ సారథ్య బాధ్యతల నుంచి తాను వైదొలుగుతన్నట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదన్నాడు. మూడు ఫార్మాట్‌లలో కూడా ప్రస్తుతం తానే కెప్టెన్‌గా ఉన్న విషయాన్ని గుర్తు చేశాడు.

తాను విశ్రాంతి తీసుకోవడం వల్లే హార్దిక్‌ను కెప్టెన్‌గా నియమించారన్నాడు. అయితే ప్రస్తుతం తన దృష్టంతా రానున్న వన్డే ప్రపంచకప్‌పైనే నిలిచింది. వరల్డ్‌కప్ నాటికి జట్టును బలోపేతం చేయడమే తన ముందున్న ప్రధాన లక్షమన్నాడు. లంకతో వన్డే సిరీస్‌ను పురస్కరించుకుని రోహిత్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ విషయాలు వెల్లడించాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News