Monday, March 10, 2025

మా ఓటమికి కారణం అతనే..: అంగీకరించిన కివీస్ కెప్టెన్

- Advertisement -
- Advertisement -

దుబాయ్: ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా భారత్ నిలిచింది. దాదాపు 12 సంవత్సరాల తర్వాత టీం ఇండియా ఛాంపియన్స్ ట్రోఫీని ముద్దాడింది. ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్‌లో భారత్ విజేతగా నిలిచింది. దీంతో భారతదేశ వ్యాప్తంగా అభిమానులు సంబరాలు జరుపుకుంటున్నారు. అయితే ప్రత్యర్థి న్యూజిలాండ్‌కు మాత్రం ఈ ఓటమి తీవ్ర నిరాశను మిగిల్చింది. టోర్నమెంట్‌ లీగ్ దశలోనూ, చివరికి ఫైనల్స్‌లోనూ భారత్‌ చేతిలో ఓటమిపాలైంది కివీస్ జట్టు. అన్ని రంగాల్లోనూ విఫలమై కప్పును చేజార్చుకుంది.

అయితే దీనిపై న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ తమ జట్టు ఓటమికి కారణాలను వెల్లడించాడు. తమ ఓటమికి కారణంగా టీం ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మనే అని అతను అన్నాడు. టోర్నమెంట్‌ మొత్తం ఎన్నో సవాళ్లు ఎదురైన తట్టుకొని నిలబడ్డామని.. కప్పును దాదాపు అందుకోబోయి.. చేజార్చుకున్నామని శాంట్నర్ పేర్కొన్నాడు. ఓ మంచి జట్టు చేతిలో ఓటమిపాలైనట్లు తెలిపాడు. భారత జట్టును వరల్డ్ క్లాస్ బౌలర్లుగా వర్ణించిన శాంట్నర్.. ఇంకో 25 పరుగులు అయినా చేయాల్సిందని అన్నాడు. ఛేజింగ్‌లో రోహిత్ శర్మ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడని.. అతను కివీస్ నుంచి మ్యాచ్‌ను లాగేసుకున్నాడని అంగీకరించాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News