Sunday, December 22, 2024

వాళ్లు ఒత్తిడిని అలవాటు చేసుకోవాలి: రోహిత్ శర్మ

- Advertisement -
- Advertisement -

కొలంబో: ఒక్క పరుగు చేస్తే గెలిచే అవకాశం ఉండేదని కానీ చివరికి మ్యాచ్ టైగా ముగియడం సరైందనేనని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపారు. శ్రీలంక-భారత్ మధ్య జరిగిన తొలి వన్డే మ్యాచ్ ముగిసిన అనంతరం రోహిత్ శర్మ  మీడియాతో మాట్లాడారు.  ఈ మ్యాచ్‌లో లంక బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారని కొనియాడారు. ఈ పిచ్‌పై 230 పరుగులు లక్ష్యాన్ని ఛేదించడం కష్టం కాదు అని, ఉత్తమంగానే బ్యాటింగ్ చేశామని, ఆరంభం నుంచి మ్యాచ్ భారత్ చేతిలోనే ఉందని, స్పిన్నర్లు రంగంలోకి దిగిన తరువాత భారత్ చేతిలో నుంచి లంక చేతిలోకి మ్యాచ్ వెళ్లిందన్నారు.

స్పిన్ బౌలింగ్‌లో వెనువెంటనే వికెట్లు కోల్పోవడంతో మ్యాచ్‌పై పట్టు కోల్పోయామన్నారు. కెఎల్ రాహుల్, అక్షర పటేల్ భాగస్వామ్యం నిర్మించడంతో టీమిండియా రేసులోకి వచ్చిందని రోహిత్ పేర్కొన్నారు. 15 బంతుల్లో ఒక పరుగు చేయాల్సిన తరుణంలో ఓడిపోవడంతో నిరాశకు గురయ్యామని రోహిత్ బాధను వ్యక్తం చేశారు. ఇలాంటి ఫలితం నిరుత్సాహనికి గురి చేసినా టైగా ముగియడం అనేది సరైందేనని చెప్పారు. మిడిలార్డర్‌లో బ్యాట్స్‌మెన్లు అద్భుతంగా బ్యాటింగ్ చేశారని, ఒత్తిడిని తట్టుకోవడం కుర్రాళ్లు అలవాటు చేసుకోవాల్సిన అవసరం ఉందని సూచనలు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News