- Advertisement -
బిసిసిఐ కార్యదర్శి జైషా
రాజ్‌కోట్: ఈ ఏడాది వెస్టిండీస్, అమెరికా వేదికగా జరిగే టి20 ప్రపంచకప్‌లో పాల్గొనే భారత జట్టుకు రోహిత్ శర్మ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడని బిసిసిఐ కార్యదర్శి జై షా స్పష్టం చేశారు. దీంతో కెప్టెన్సీ విషయంలో నెలకొన్న అనిశ్చితికి తెరపడింది. ఈ వరల్డ్‌కప్‌లో హార్దిక్ పాండ్యను కెప్టెన్‌గా నియమిస్తారనే వార్తలు కొన్ని రోజులుగా హల్‌చల్ చేస్తున్నాయి. తాజాగా జైషా ప్రకటనతో వీటికి పు ల్‌స్టాప్ పడింది. అంతేగాక ఐపిఎల్ 2024 సీజన్ కూడా భారత్‌లోనే జరుగుతుందని బోర్డు స్పష్టం చేసింది. లోక్‌సభ ఎన్నికలు ఉన్నా ఐపిఎల్ మా త్రం భారత్‌లోనే కొనసాగుతుందని వివరించింది.
- Advertisement -