Wednesday, January 22, 2025

ప్రపంచ క్రికెట్ లో ఒకే ఒక్కడు.. చరిత్ర సృష్టించనున్న రోహిత్ శర్మ

- Advertisement -
- Advertisement -

ప్రపంచ క్రికెట్ లో ఒకే ఒక్కడిగా నిలిచి చరిత్ర సృష్టించేందుకు ఒక్క అడుగు దూరంలో ఉన్నాడు టీమిండియా కెప్టెన్ హిట్ మ్యాన్ రోహిత్ శర్మ. అఫ్గానిస్థాన్ జట్టుతో టీమిండియా ఆదివారం రెండో టీ20 మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ తో రోహిత్ అంతర్జాతీయ టీ20 క్రికెట్ చరిత్రలో ఒకే ఒక్కడిగా హిస్టరీ క్రియేట్ చేయనున్నాడు.

అత్యధికంగా 150 టీ20 మ్యాచ్ లు ఆడిన క్రికెటర్ గా రోహిత్ నిలవనున్నాడు. ఇప్పటివరకు రోహిత్..149 టీ20 మ్యాచ్ లు ఆడాడు.. ఈ రోజు జరిగే మ్యాచ్ తో రోహిత్.. 150 టీ20 మ్యాచ్ లు ఆడిన ఏకైక క్రికెటర్ గా రికార్డు నెలకొల్పనున్నాడు. అంతేకాదు, టీ20 క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన వారి జాబితాలో 3,853 రన్స్‌ తో రోహిత్ రెండో స్థానంలో ఉన్నాడు.

అత్యధిక టీ20 మ్యాచ్ లు ఆడిన వారి జాబితాలో రోహిత్ శర్మ తర్వాత.. పాల్‌ స్టిర్లింగ్‌(ఐర్లాండ్‌) 134, జార్జ్‌ డాక్రెల్‌(ఐర్లాండ్‌) 128, షోయబ్‌ మాలిక్‌(పాకిస్తాన్‌) 124, మార్టిన్‌ గప్టిల్‌(న్యూజిలాండ్‌) 122లు టాప్ 5లో ఉన్నారు. ఈ జాబితాలో కింగ్ కోహ్లీ 115 అంతర్జాతీయ టీ20 మ్యాచ్ లు ఆడి 11వ స్థానంలో ఉన్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News