Friday, November 22, 2024

సెమీ ఫైనల్‌లో టాస్ ఫిక్సింగ్…. పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: 2023 వరల్డ్ కప్‌లో భారత్ తొమ్మిది విజయాలతో సెమీస్ చేరింది. సెమీఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ జట్టును టీమిండియా మట్టి కరిపించి ఫైనల్‌కు చేరుకుంది. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ టాస్ ఫిక్సింగ్ కు పాల్పడ్డారని పాక్ మాజీ ఆటగాడు సికందర్ బఖ్త్ ఆరోపణలు చేశాడు. రోహిత్ ఐసిసి అధికారులకు దూరంగా కాయిన్ విసరడంతో ఫలితం ఇండియాకు అనుకూలంగా వచ్చిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాయిన్ దూరంగా పడటం వల్ల ప్రత్యర్థి కెప్టెన్‌కు బొమ్మ పడిందా? బొరుసు పడిందా అని చెక్ చేయలేదని, బిసిసిఐ మేనేజ్ చేయడంతోనే టీమిండియా గెలుస్తుందని అతడు అనుమానం వ్యక్తం చేశాడు. పాక్ వీడియో తీసి రోహిత్ టాస్ ఫిక్స్ చేశాడని ఆరోపణలు చేసింది. ఈ నేపథ్యంలో బిసిసిఐలో ఐసిసి విలీనం కావడం మంచిదని, కాయిన్ దూరంగా విసరడం, రిఫరీ కనీసం కాయిన్‌ను చూడకపోవడం విడ్డూరం అభిప్రాయం వ్యక్తం చేశాడు. పిచ్ ఫిక్సింగ్, టాస్ ఫిక్సింగ్, అంపైర్లను కొనడంలాంటికి చేస్తున్నారని ఓ పాకిస్తానీ ఘాటు వ్యాఖ్యలు చేశాడు.

దీంతో పాకిస్థాన్ ఈ వరల్డ్ కప్‌లో తొమ్మిది మ్యాచ్‌ల్లో ఐదు ఓడిపోయి ఇంటిముఖం పట్టిన విషయం తెలిసిందే. ఆఫ్ఘానిస్థాన్‌లో జరిగిన మ్యాచ్‌లో పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ కూడా కాయిన్ దూరంగా విసిరి టాస్ గెలిచాడంటూ వీడియోను భారత క్రికెట్ అభిమానులు పోస్టు చేసి కౌంటర్ ఇస్తున్నారు. ఈ కౌంటర్ పాకిస్తానీయులు ఎలా రికౌంటర్‌లో చేయాలో అర్థం కావడం లేదు. పాక్ మాజీ ఆటగాళ్లు వసీం అక్రమ్, షోయబ్ అక్తర్ లాంటి వారు భారత్ అద్భుత ప్రదర్శన చేస్తుందని ప్రశంసిస్తుంటే కొందరు మాత్రం చౌకబారు మాట్లాడుతున్నారని నెటిజన్లు మండిపడుతున్నారు. టీమిండియా బౌలర్ల కోసం ఐసిసి ప్రత్యేక బంతులు తయారు చేసి ఇచ్చిందని పాక్ మాజీ ఆటగాడు హసన్ రజా లాంటి వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News