Wednesday, January 22, 2025

శ్రీలంకతో టీ-20లకు రోహిత్ శర్మ దూరం!

- Advertisement -
- Advertisement -

వేలి గాయంతో బంగ్లాదేశ్ తో టెస్టు సిరీస్ కు దూరమైన రోహిత్ శర్మ జనవరిలో శ్రీలంకతో జరిగే టీ-20 సిరీస్ కు కూడా దూరం కానున్నట్లు వార్తలోస్తున్నాయి. అతనికి గాయం తీవ్రత ఇంకా తగ్గలేదని బిసిసిఐ అధికారి ఒకరు తెలిపారు. శ్రీలంక పర్యటనకు కేవలం టీ20 స్పెషలిస్టులనే ఎంపిక చేస్తారని, హార్థిక్ పాండ్యా కెప్టెన్సీ చేస్తాడని పేర్కొన్నారు. కాగా, కెఎల్ రాహుల్, భువనేశ్వర్ కుమార్ లాంటి స్టార్ ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చే అవకాశమున్నట్లు సమాచారం. జనవరి మూడు నుంచి టీ20లు, జనవరి 10 నుంచి మూడు వన్డే మ్యాచ్ లతో శ్రీలంక- భారత్ తలపడనున్నాయి. రాహుల్ కు విశ్రాంతి ఇస్తే శుభమన్ గిల్ కు అవకాశం ఉంది. అటు విరాట్ కోహ్లీకి కూడా శ్రీలంక టూర్ లో అవకాశం దొరక్కపోవచ్చు అని బిసిసిఐ వర్గాలు తెలిపాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News