Sunday, January 19, 2025

రోహిత్‌కు విశ్రాంతి… కెప్టెన్‌గా రహానే?

- Advertisement -
- Advertisement -

ముంబయి: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గత కొన్ని రోజుల నుంచి తీరిక లేకుంగా క్రికెట్ ఆడుతుండడంతో విశ్రాంతి ఇవ్వాలని క్రికెట్ పండితులు సూచిస్తున్నారు. ఐపిఎల్‌లో 16 మ్యాచ్‌లు ఆడి 332 పరుగులు సాధించి పర్వాలేదనిపించాడు. గత కొన్ని రోజులుగా టెస్టుల్లో బ్యాటింగ్ విషయంలో విఫలమవుతున్నారు. ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్‌లో తొలి ఇన్నింగ్స్ 15, రెండో ఇన్నింగ్స్‌లో 43 పరుగులు చేసి ఘోరంగా విఫలమయ్యాడు.

Also Read: టివి, మొబైల్ ధరలు తగ్గొచ్చు

దీంతో అతడు జట్టు భారంగా మారడంతో ఆస్ట్రేలియాతో జరిగిన వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ లో భారత జట్టు ఓటమిని చవిచూసింది. రోహిత్ టెస్టు కెప్టెన్ అయ్యాక 11 ఇన్నింగ్స్‌లో 35 సగటుతో 390 పరుగులు చేసి ఫామ్‌లేమితో ఇబ్బంది పడుతున్నాడు. వెస్టిండీస్ టూర్‌లో రోహిత్‌కు విశ్రాంతి ఇచ్చి అజింక్య రహానేకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాలని బిసిసిఐ భావిస్తోంది. డబ్ల్యుటిసి ఫైనల్‌లో ఛటేశ్వరా పుజారా ఘోరంగా విఫలం కావడంతో జట్టులో ఆయన స్థానం ప్రశ్నార్థకంగా మారింది. ఒక వేళ కోహ్లికి విశ్రాంతి ఇవ్వాలని సెలక్టర్లు భావిస్తే పుజారా జట్టులోకి తీసుకోవచ్చు. ఇప్పటికే టెస్టు జట్టులోకి రావడానికి జైస్వాల్, సర్ఫరాజ్ ఖాన్ ఎదురు చూస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News